బురూజ్ సూరహ్

బుధ, 04/11/2018 - 14:01

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 85వ సూరహ్ అయిన “బురూజ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

బురూజ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 85వ సూరహ్ ఇది. “బురూజ్”, పదం “బుర్జ్” అను పదం యొక్క బహువచనం. అనగ ఎత్తైన కోట, మెరిసే నక్షత్రాలు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “బురూజ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 4 సార్లు(“బురూజ్” అని 2సార్లు మరియు “బురూజా” అని 2 సార్లు నిసా సూరహ్, 78వ ఆయత్ లో. హిజ్ర్ సూరహ్ 16వ ఆయత్ లో మరియు ఫుర్ఖాన్ సూరహ్ 61వ ఆయత్ లో) వచ్చింది. ఈ సూరహ్ లో 22 ఆయత్‍లు, 109 పదాలు మరియు 468 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “షమ్స్” సూరహ్ మరియు దీని తరువాత “తీన్” సూరహ్ అవతరించబడ్డాయి. “బురూజ్” సూరహ్ ను “అన్నబీయీన్” అని కూడా అంటారు. “బురూజ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “బురూజ్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “బురూజ్” సూరహ్, దైవప్రవక్తల యొక్క సూరహ్, దీనిని నమాజ్ లో పఠించినవాడు అంబియా, ముర్సలీన్ మరియు సాలెహీన్లతో పాటు (ప్రళయంనాడు) లేపబడతాడు.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ311].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ311.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17