ఫజ్ర్ సూరహ్

శని, 04/14/2018 - 12:26

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 89వ సూరహ్ అయిన “ఫజ్ర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఫజ్ర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 89వ సూరహ్ ఇది. “ఫజ్ర్” అనగ ఉదయం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఫజ్ర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 6 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 30 ఆయత్‍లు, 139 పదాలు మరియు 584 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “లైల్” సూరహ్ మరియు దీని తరువాత “జుహా” సూరహ్ అవతరించబడ్డాయి. “ఫజ్ర్” ను “ఇన్ఖిలాబ్” మరియు “హుసైన్” అని కూడా అంటారు. “ఫజ్ర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ఫజ్ర్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రత్యేకత, ఇది ఇమామ్ హుసైన్ గురించి అవతరించబడినది ఎందుకంటే “నఫ్సె ముత్మఇన్నహ్” యొక్క దృష్టాంతము ఇమామ్ హుసైన్[అ.స] కాబట్టి. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “లయాలీ అష్ర్” అనగా పది రాత్రులలో “ఫజ్ర్” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడి పాపములను క్షమిస్తాడు మరియు దానిని వేరే రోజులలో చదివితే ప్రళయం నాడు అతడు మెరిసిపోయేలా నిశ్చయించబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ341].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ341.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
20 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12