ఖద్ర్ సూరహ్

గురు, 04/26/2018 - 16:15

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 97వ సూరహ్ అయిన “ఖద్ర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖద్ర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 97వ సూరహ్ ఇది. “ఖద్ర్” అనగ పరిమాణము, కొలత. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖద్ర్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 5 ఆయత్‍లు, 30 పదాలు మరియు 115 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అబస”  సూరహ్ మరియు దీని తరువాత “షమ్స్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖద్ర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి మూడు ఆయత్లలో “షబే ఖద్ర్” ప్రతిష్టత గురించి వివరించబడడం. ఈ సూరహ్ ప్రత్యేకతలు; 1. “షబే ఖద్ర్” యొక్క ప్రతిష్టత ప్రస్తావనం. 2. ఖుర్ఆన్ షబేఖద్ర్ లో అవతరించబడిందన్న విషయం పై నిదర్శనం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు “ఖద్ర్” సూరహ్ ను పఠించే వాడి పుణ్యం పవిత్ర మాసంలో ఉపవాసం ఉన్నవారి పుణ్యంతో సమానం”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ403].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ403.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29