అల్
హంద్

శుక్ర, 04/14/2017 - 06:18

 

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ అంతిమ గ్రంథం ఖుర్ఆన్. అందులో 114 సూరాలన్నాయి. అందులో మొదటి సూరా "అల్ హంద్".

అల్ హంద్

హంద్ యొక్క అర్ధం స్తుతి మరియు కృతజ్ఞత. ఈ సూరా యొక్క ఆయతుల సంఖ్య 7. ఈ సూరాలో “అల్ హందు” అన్న పదం ఒకేసారి వచ్చింది. కాని పూర్తి ఖుర్ఆన్ లో ఈ పదం 38 సార్లు వచ్చింది. ఈ పూర్తి సూరాలో 29 పదాలు మరియు 143 అక్షరాలున్నాయి. రెండు సార్లు “అల్లాహ్” అనే పదం వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ముద్దస్సిర్” సూరా మరియు దీని తరువాత “మసద్” సూరా అవతరించబడ్డాయి. దీనికి 15 పేర్లున్నాయి. అవి: 1. హంద్, 2. షుక్‏ర్, 3. ఫాతెహా, 4. సబ్ఎ మసానీ, 5. ఉమ్ముల్ కితాబ్, 6. ఉమ్ముల్ ఖుర్ఆన్, 7.కన్‏జ్, 8. అసాస్, 9. మునాజాత్, 10. షిఫా, 11. దుఆ, 12.నూర్, 13. కాఫియహ్, 14. వాఫియహ్, 15. రాఖియహ్.
ఈ సూరా యొక్క ప్రత్యేకతలు: 1. అన్ని సూరాల కన్న ఎక్కువ పేర్ల గల సూరా. 2. ఈ సూరా రెండు సార్లు (ఒకసారి మక్కాలో మరో సారి మదీనాలో) అవతరించబడింది. 3. ఖుర్ఆన్ ఈ సూరాతోనే మొదలౌతుంది. 4. ప్రతీ వాజిబ్ మరియు ముస్తహబ్ నమాజులలో చదవడం తప్పని సరి.
దాని శ్రేష్ఠత: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: ఏ ముస్లిమైతే ఈ సూరాను పఠిస్తాడో అతడు సగం ఖుర్ఆన్ కన్న ఎక్కువ పఠించినట్లు మరియు అతనికి విశ్వాసులైన స్త్రీ, పురుషులందరికి దానం(సద్‏ఖా) ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. [మజ్మవుల్ బయాన్, భాగం1, పేజీ36]

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, షేఖ్ తబర్సీ, పబ్లిషర్స్ దారుల్ ఫిక్ర్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

సలామ్. మీరు వ్రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది.

Submitted by షాకేర్ on

సలామున్ అలైకుం
మాషా అల్లాహ్

Submitted by zaheer on

వ అలైకుం సలామ్, ధన్యవాదాలు. ఇలాగే మీ అభిప్రాయాలు మాకు తెలియపరుస్తు ఉండండి.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21