ఇన్షిరాహ్ సూరహ్

బుధ, 04/18/2018 - 17:30

.పివత్ర ఖుర్ఆన్ యొక్క 94వ సూరహ్ అయిన “ఇన్షిరాహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఇన్షిరాహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 94వ సూరహ్ ఇది. “ఇన్షిరాహ్” అనగ విశాల హృదయం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నష్రహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 5 సార్లు(“షరహ” అని 2 సార్లు, “యష్రహ్” అని 1 సారి, “నష్రహ్” అని 1 సారి మరియు “ఇష్రహ్” అని 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 8 ఆయత్‍లు, 27 పదాలు మరియు 102 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “జుహా” సూరహ్ మరియు దీని తరువాత “అస్ర్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఇన్షిరాహ్” సూరహ్ ను “షరహ” మరియు “అలమ్ నష్రహ్” అని కూడా అంటారు. “ఇన్షిరాహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో “నష్రహ్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ఇన్షిరాహ్” సూరహ్ ను పఠిస్తాడో అతడు నన్ను దుఖంలో చూసి నా దుఖ్ఖాన్ని నా నుండి దూరం చేసినట్లు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ387].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27