హజ్రతే ఖిజ్ర్[అ.స] యొక్క సుధీర్ఘ జీవితకాలం యొక్క రహస్యం

గురు, 05/03/2018 - 12:20

ఇమాం మెహ్ది[అ.స] వారికి ఆ అల్లాహ్ అంత జీవితకాలాన్ని ప్రసాదించాడు తద్వారా ప్రజలు వారి యొక్క జీవితకాలాన్నిహజ్రత్ ఖిజ్ర్[అ.స] ల వారి జీవితకాలంతో తర్కంగా చేసి దానిని అర్ధంచేసుకోవడానికి మరియు ఈ విధంగా విరోధుల యొక్క సమస్యలకు పరిష్కారం అయిపోతుంది.

హజ్రతే ఖిజ్ర్[అ.స] యొక్క సుధీర్ఘ జీవితకాలం యొక్క రహస్యం

ప్రవక్త హజ్రతే ఖిజ్ర్[అ.స] యొక్క ప్రస్థావన దివ్యఖురాన్లో చాలా చోట్ల వచ్చింది,కొంత మంది వారు ప్రవక్త కారని కానీ ఆ అల్లాహ్ యొక్క పవిత్ర దాసులలో ఒకరని నమ్ముతారు,వారి సుధీర్గ జీవితకాలం యొక్క ప్రస్థావన కూడా పవిత్ర ఖురాన్లో దొరుకుతుంది,సూరయే కహఫ్ లో హజ్రతే మూసా[అ.స] మరియు హజ్రతే ఖిజ్ర్[అ.స] మధ్య జరిగిన సంభాషణ వాటిలో నుండి ఒకటి.
ఆ అల్లాహ్ వారిని తన పవిత్ర దాసులలో ఒకరిగా గుర్తుచేస్తూ సూరయే కహఫ్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు:
فَوَجَدَا عَبْدًۭا مِّنْ عِبَادِنَآ ءَاتَيْنَٰهُ رَحْمَةًۭ مِّنْ عِندِنَا وَعَلَّمْنَٰهُ مِن لَّدُنَّا عِلْمًۭا
అక్కడ   వారు   మా   దాసులలోని   ఒక   దాసుణ్ణి   కనుగొన్నారు.   మేము   అతనికి   మా   వద్ద   నుంచి   ఓ   ప్రత్యేక   కారుణ్యాన్ని   ప్రసా   దించి   ఉన్నాము.   ఇంకా   మా   వద్ద   నుంచి   అతనికి   ఓ   ప్రత్యేక   విద్యను   నేర్పి   ఉన్నాము [అల్-కహఫ్/65].
కానీ హజ్రత్ ఖిజ్ర్[అ.స]ల వారి సుదీర్ఘ జీవితకాల రహస్యం ఏమిటి?అనే ప్రశ్న అందరికి కలుగుతుంది,వారు ఏమన్నా అమృతం సేవించడం వలన వారికి అంత సుదీర్ఘ జీవితకాలం ప్రాప్తించిందా?అనే సందేహం కూడా కలుగుతుంది.
అసలు దీనికి కారణమేమిటి అన్నదానికి జవాబుగా ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: హజ్రత్ ఖిజ్ర్[అ.స]ల వారిని ప్రవక్తగా చేయటానికి లేదా వారిపై ఒక గ్రంధాన్ని అవతరింప జేయటానికి, అతని ధర్మము ముందువారి ధర్మాన్ని రద్దు చేయటానికి లేదా వారిని ఉత్తరాధికారిగా నియమించి ప్రజల ద్వార ఆజ్ఞపాలన చేయించడానికి వారికి సుదీర్ఘ జీవితకాలం ఇవ్వబడలేదు,వారికి అంత జీవితకాలం ఎందువలన ఇవ్వబడినదంటే ఆ అల్లాహ్ యొక్క నిత్య జ్ఞానంలో మా ఖాయం[అ.స] యొక్క సుదీర్ఘ జీవితకాలం ఖరారు చేయబడింది మరియు ఆ అల్లాహ్ కు వీరి [ఇమాం మెహ్ది అ.స ల వారి] సుదీర్ఘ జీవితకాలాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కూడా తెలుసు అందువలనే ఆ అల్లాహ్ హజ్రత్ ఖిజ్ర్[అ.స] ల వారికి అంత జీవితకాలాన్ని ప్రసాదించాడు తద్వారా ప్రజలు మా ఖయం[అ.స] యొక్క జీవితకాలాన్ని వారి జీవితకాలంతో తర్కంగా చేసి దానిని అర్ధంచేసుకోవడానికి మరియు ఈ విధంగా విరోధుల యొక్క సమస్యలకు పరిష్కారం అయిపోతుంది మరియు ప్రజలపై తన అనుగ్రహాన్ని కూడా సంపూర్తిగావిస్తాడు. 

రెఫరెన్స్
కమాలుద్దీన్ వ తమామున్ నియమహ్,2వ భాగం,పేజీ నం:333,కితాబుల్ గైబత్,పేజీ నం:172.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15