జిల్ జాల్ సూరహ్

గురు, 05/10/2018 - 16:59

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 99వ సూరహ్ అయిన “జిల్ జాల్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

జిల్ జాల్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 99వ సూరహ్ ఇది. “జిల్ జాల్” అనగ భూకంపం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “జిల్ జాల్” అను పదం 2 సార్లు(జుల్ జిలత్ అని ఒకసారి మరియు జిల్ జాల్ అని ఒకసారి) మరియు పూర్తి ఖుర్ఆన్ లో 6 సార్లు (“జుల్ జిలత్” అని 1 సారి, “జుల్ జిలూ” అని 2 సార్లు, “జిల్ జాలన్” అని 1 సారి, “జల్ జలహ్” అని 1 సారి మరియు “జిల్ జాలహా” అని 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 8 ఆయత్‍లు, 36 పదాలు మరియు 158 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “నిసా” సూరహ్ మరియు దీని తరువాత “హదీద్” సూరహ్ అవతరించబడ్డాయి. “జిల్ జాల్” సూరహ్ ను “జల్ జలహ్” అని కూడా అంటారు. “జిల్ జాల్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో “జుల్ జిలత్” అను పదం ఉండడం మరియు ఈ పదం “జిల్ జాల్” అను పదం నుండి తీసుకోబడినది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “జిల్ జాల్” సూరహ్ పఠనాన్ని మరవకండి, ఎవరైతే దానిని మస్తహబ్ నమాజులలో పఠిస్తారో అతడు భూకంపానికి గురికాడు. భూకంపం, పిడుగు మరియు ప్రపంచంలో కష్టమైన వాటి ద్వార మరణించడు. మరణించిన తరువాత నేరుగా స్వర్గానికి వెళ్తారు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ416].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ416.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22