తీన్ సూరహ్

సోమ, 04/23/2018 - 16:10

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 95వ సూరహ్ అయిన “తీన్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

తీన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 95వ సూరహ్ ఇది. “తీన్” అనగ అత్తిపండు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “తీన్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 8 ఆయత్‍లు, 34 పదాలు మరియు 162 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒకసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “బురూజ్” సూరహ్ మరియు దీని తరువాత “ఖురైష్” సూరహ్ అవతరించబడ్డాయి. “తీన్” సూరహ్ ను “జైతూన్” మరియు “తీన్ వ జైతూన్” అని కూడా అంటారు. “తీన్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో “తీన్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “ఎవరైతే “తీన్” సూరహ్ ను నమాజులలో పఠిస్తాడో అల్లాహ్ అతడికి స్వర్గం నుండి అతడు సంతోషపడేంతగా ప్రసాదిస్తాడు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ392].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ392.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25