బయ్యినహ్ సూరహ్

మంగళ, 05/01/2018 - 13:58

అల్లహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 98వ సూరహ్ అయిన “బయ్యినహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

బయ్యినహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 98వ సూరహ్ ఇది. “బయ్యినహ్” అనగ వివరించడం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “బయ్యినహ్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 19 సార్లు “బయ్యినహ్” మరియు 52 సార్లు “బయ్యినాత్” అని వచ్చింది. ఈ సూరహ్ లో 8 ఆయత్‍లు, 94 పదాలు మరియు 404 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “తలాఖ్”  సూరహ్ మరియు దీని తరువాత “హష్ర్” సూరహ్ అవతరించబడ్డాయి. “బయ్యినహ్” సూరహ్ ను “బరియ్యహ్”, “లమ్ యకునిల్లజీన”, “అహ్లుల్ కితాబ్” మరియు “ఖయ్యిమహ్” అని కూడా అంటారు.“బయ్యినహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో “బయ్యినహ్” అను పదం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు “ఒకవేళ ప్రజలకు “బయ్యినహ్” సూరహ్ ప్రతిష్టత గురించి తెలిసిందంటే ధనం మరియు భార్యాపిల్లలను విడిచి దీని వెనక పడి ఉండే వారు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ411].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ411.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23