ఫీల్ సూరహ్

ఆది, 05/13/2018 - 11:41

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 105వ సూరహ్ అయిన “ఫీల్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఫీల్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 105వ సూరహ్ ఇది. “ఫీల్” అనగా ఏనుగు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఫీల్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 5 ఆయత్‍లు, 23 పదాలు మరియు 97 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “కాఫిరూన్” సూరహ్ మరియు దీని తరువాత “ఫలఖ్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “ఫీల్” కాకుండా “అలమ్ తరా” అని కూడా అంటారు. “ఫీల్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో “అస్హాబుల్ ఫీల్” సంఘటన ప్రస్తావనం ఉండడం. ఈ సూరహ్ యొక్క ప్రాముఖ్యత, ఇది నమాజులో కేవలం ఈ సూరహ్ చదివితే చాలదు దీనితో పాటు “ఖురైష్” సూరహ్ చదవడం అవసరం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఏ వ్యక్తి అయితే వాజిబ్ నమాజులలో “ఫీల్” మరియు “ఖురైష్” సూరహ్ ను పఠిస్తాడో ప్రళయం నాడు భూమి యొక్క ఎత్తుపలాలు అతడు నమాజీ అని సాక్ష్యమిస్తాయి”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ441].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ441.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16