హుమజహ్ సూరహ్

ఆది, 05/13/2018 - 11:36

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 104వ సూరహ్ అయిన “హుమజహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

హుమజహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 104వ సూరహ్ ఇది. “హుమజహ్” అనగా ఇతరుల తప్పులను వెదకేవాడు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “హుమజహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 9 ఆయత్‍లు, 33 పదాలు మరియు 134 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 1 సారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖియామహ్” సూరహ్ మరియు దీని తరువాత “ముర్సలాత్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “హుమజహ్” కాకుండా “లుమజహ్” అని కూడా అంటారు. “హుమజహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “హుమజహ్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “వాజిబ్ నమాజులలో “హుమజహ్” సూరహ్ ను పఠించేవాడు దరిద్రం, నిరాహారం నుండి దూరంగా ఉంటాడు. అల్లాహ్ అతనికి అతని భాగాన్ని ప్రసాదిస్తాడు. దష్టమరణం నుండి కాపాడుతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ437].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ437.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19