నస్ర్ సూరహ్

గురు, 05/24/2018 - 09:05

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 110వ సూరహ్ అయిన “నస్ర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నస్ర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 110వ సూరహ్ ఇది. “నస్ర్” అనగా సహాయం, మద్దత్తు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నస్ర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 11 సార్లు “అల్ నస్ర్” అని మరియు 3 సార్లు “నస్రన్” అని వచ్చింది. ఈ సూరహ్ లో 3 ఆయత్‍లు, 19 పదాలు మరియు 80 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 2 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదానహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “తౌబహ్” సూరహ్ అవతరించింది కాని దీని తరువాత ఏ సూరహ్ అవతరించబడలేదు. ఈ సూరహ్ ను “నస్ర్” కాకుండా “ఇజా జాఅ” మరియు “తౌదీ” అని కూడా అంటారు. “నస్ర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “నస్ర్” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ ప్రాముఖ్యత, ఇదే దైవప్రవక్త[స.అ] పై అవతరించబడ్డ చివరి సూరహ్. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే ముస్తహబ్ లేదా వాజిబ్ నమాజ్ లో “నస్ర్” సూరహ్ పఠిస్తాడో అతడు తన శత్రువుల పై విజయం పొందుతాడు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ466].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ466.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21