ఫలఖ్ సూరహ్

శని, 05/26/2018 - 20:54

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 113వ సూరహ్ అయిన “ఫలఖ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఫలఖ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 113వ సూరహ్ ఇది. “ఫలఖ్” అనగ పగులు, చీల్చు అనగా ఉదయం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఫలఖ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 5 ఆయత్‍లు, 23 పదాలు మరియు 73 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఫీల్” సూరహ్ మరియు దీని తరువాత “నాస్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఫలఖ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ఫలఖ్” అన్న ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “విత్ర్” నమాజ్ లో “ఇఖ్లాస్” “ఫలఖ్” మరియు “నాస్” సూరహ్ లను పఠించే వారితో దూతలు “శుభాకాంక్షలు, అల్లాహ్ నీ ఈ నమాజ్ ను అంగీకార్హతను ప్రసాదించాడు” అని అంటారు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ491].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ491.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16