నాస్ సూరహ్

ఆది, 05/27/2018 - 12:33

అల్లాహ్ తరుపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 114వ సూరహ్ అయిన “నాస్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నాస్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 114వ సూరహ్ ఇది. “నాస్” అనగ మానవులు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నాస్” అను పదం 5 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 241 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 6 ఆయత్‍లు, 20 పదాలు మరియు 80 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఫలఖ్” సూరహ్ మరియు దీని తరువాత “ఇఖ్లాస్” సూరహ్ అవతరించబడ్డాయి. “నాస్” సూరహ్ నామకరణానికి కారణం ఈ చిన్న సూరహ్ లో 5 సార్లు “నాస్” అన్న పదం ఉండడం. ఇది ఖుర్ఆన్ యొక్క చివరి సూరహ్. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఒకరోజు దైవప్రవక్త[స.అ] చాలా ఎక్కువగా అనారోగ్యానికి గురి అయ్యారు, జిబ్రయీల్ వారి తలాపి వద్ద మరియు మీకాయీల్ వారి కాళ్ళ వద్ద నిలబడ్డారు, జిబ్రయీల్ “ఫలఖ్” సూరహ్ ను మరియు మీకాయీల్ “నాస్” సూరహ్ లను పఠించి దైవప్రవక్త[స.అ] ను అల్లాహ్ రక్షణ కలిపించేవారు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ495].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ495.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18