.హిజ్రీ యొక్క మొదటి సంవత్సరం నుండి 11వ సంవత్సరం వరకు జరిగిన ముఖ్య సంఘటనలు సంక్షిప్తంగా.
1వ సంవత్సరంలో: ప్రవక్త ముహమ్మద్[స.అ], మదీనా వాసులు(ముహాజిరీన్) మరియు మక్కా వాసుల(అన్సార్) బంధం అన్నదమ్ముల బంధం, అని ఒకరికి ఒకరు సహాయపడాలని, ప్రకటించారు.
2వ సంవత్సరంలో: 1. మస్లింల యొక్క ఖిబ్లా(నామాజు చదివే దిశ) “బైతుల్ ముఖద్దస్”(పాలస్తీన) నుండి “కాబా”(మక్కా)కు మార్చ బడింది. 2. జనాబె ఫాతెమా జహ్రా[స.అ] యొక్క వివాహం హజ్రత్ అలీ[అ.స]తో జరిగింది. 3. షాబాన్ నెల చివరిలో రమజాన్ నెలలో ఉపవాసదీక్షలు వాజిబ్
గా నిర్ధారించబడ్డాయి. 4. అల్లాహ్ తరపు నుండి “ముష్రికీన్”లతో యుద్ధం చేయుటకు ఆజ్ఞ అయింది. 5. “బద్‌ర్” యుద్దం కూడా జరిగింది.
3వ సంవత్సరంలో: 1. జనాబె హంజా[అ.స] “ఒహొద్” యుధ్ధంలో వీరమరణం పొందారు. 2. ఇమామ్ హసన్[అ.స] జన్మించారు.
4వ సంవత్సరంలో: ఇమామ్ హుసైన్[అ.స] జన్మించారు(కొన్ని ఇస్లాం చరిత్ర పుస్తకాలలో ఇమామ్ హుసైన్ [అ.స] 3 వ హిజ్రత్ లో జన్మించారు అని కూడా వ్రాసి వుంది).
5వ సంవత్సరంలో: “ఖందఖ్” యుద్ధం జరిగింది జంగె ఖందఖ్‌ను “జంగె అహ్‌జాబ్” అని కూడా అంటారు.
6వ సంవత్సరంలో: “జాతుర్రిఖా”, “బనీ లహ్‌యాన్” అను యుద్ధాలు జరిగాయి.
7వ సంవత్సరంలో: “ఖైబర్” యుధ్ధం జరిగింది.
8వ సంవత్సరంలో: 1. “మౌతా” యుధ్ధం జరిగింది. 2. “ఫత్‌హె మక్కా” కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. 3. “హునైన్” యుధ్ధం కూడా జరిగింది.
9వ సంవత్సరంలో: “తబూక్” యుధ్దం జరిగింది.
10వ సంవత్సరంలో: 1. క్రైస్తవుల పెద్దల మరియు దైవప్రవక్త ముహమ్మద్[అ.స] మధ్య ముబాహలా జరిగింది. 2. దైవప్రవక్త ముహమ్మద్[స.అ] తమ చివరి హజ్ చేసి వస్తుండగా “గదీర్ ఖుమ్” అను మైదానంలో వారి తరువాత హజ్రత్ అలీ[అ.స]ను అతని ఉత్తరాధికారిగా నిశ్చయించారు. మరియు ప్రజల మార్గదర్శిగా ప్రకటించారు.
11వ సంవత్సరంలో: సఫర్ నెల 28వ తారీకున దైవప్రవక్త ముహమ్మద్[స.అ] స్వర్గస్ధులైయ్యారు.
వ్యాఖ్యానించండి