.జనానికి ఇమామత్ పదవి యొక్క ప్రాముఖ్యత (విలువ) మరియు ఉమ్మత్ లో దాని స్థానం తెలియదు.
దైవప్రవక్త యొక్క ఎనిమిదవ ఉత్తరాధికారి ఇమామ్ అలీ రిజా[అస] ఇలా ప్రవచించారు "هَلْ يَعْرِفُونَ قَدْرَ الْإِمَامَةِ وَ مَحَلَّهَا مِنَ الْأُمَّةِ فَيَجُوزَ فِيهَا اخْتِيَارُهُمْ" జనానికి ఇమామత్ పదవి యొక్క ప్రాముఖ్యత (విలువ) మరియు ఉమ్మత్ లో దాని స్థానం తెలుసా! (ఇమామత్ పదవి పట్ల) వారి ఎన్నికను అంగికరించడానికి?[ఉయూను అఖ్బార్ అల్ రిజా, భాగం1, అధ్యాయం20, పేజీ217]
ఎన్నిక కోసం ఎన్నుకునే వారికి ఎన్నుకోబడే మనిషి గురించి తెలిసి ఉండడం అవసరం లేకపోతే ఆ ఎన్నిక అజ్ఞానపు మరియు వ్యర్థపు ఎన్నిక అవుతుంది, ఒకవేళ ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటే, దాని అర్ధమేమిటంటే ప్రజలకు ఇమామత్ మరియు నాయకత్వం యొక్క ఉత్తమస్థానం తెలుసన్నమాట!, కాని వాస్తవానికి ప్రజల జ్ఞానం మరియు వివేకం ఆ ఉత్తమస్థానాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. పై చెప్పబడిన ఇమామ్ అలీ రిజా[అ.స] యొక్క ప్రవచనం యొక్క అర్ధం ఇప్పుడు ప్రజల ఆలోచనాజ్ఞానం తక్కువగా ఉంది అని కాదు, అలాగైతే ప్రజల జ్ఞానం పెరిగితే ఇమామత్ యొక్క ఉత్తమస్థానాన్ని తెలుసుకుంటారు మరియు ఆ తరువాత ఇమామ్ ను ఎన్నుకుంటారు అన్న అర్థం వస్తుంది. నిజానికి ఇమామత్ పదవి ప్రజల వివేకానికి అంతుపట్టనిది, అంతేకాదు ఇమామత్ యొక్క స్థానం అల్లాహ్ కు సంబంధించినది అనగ కేవలం అల్లాహ్ యే ఇమామ్ ను ఎన్నుకోగలడు, ప్రజలు అందులో ఎటువంటి జోక్యం కలిగిలేరు. అలాగే తెలుసుకోవలసిన ఇంకో విషయమేమిటంటే తన గ్రంథంలో ఇస్లామియా సమాజానికి అవసరమైన వాటన్నింటిని ప్రవచించిన అల్లాహ్ తన గ్రంథంలో ఇమామత్ గురించి చెప్పలేదా!, మరి ఎందుకని ప్రజలకు ఇమామ్ ను ఎన్నుకునే అవసరం కలిగింది!?
రిఫ్రెన్స్
ఉయూను అఖ్బార్ అల్ రిజా, భాగం1, అధ్యాయం20, పేజీ217. షేఖ్ సదూఖ్, నష్రె జహాన్, తెహ్రాన్, 1378 షం.
వ్యాఖ్యలు
Mashaallah
వ్యాఖ్యానించండి