ఖాకె షిఫా

సోమ, 09/10/2018 - 18:06

"ఖాక్" అనగా మట్టి, "షిఫా" అనగా ఆరోగ్యం, స్వస్థత. "ఖాకె షిఫా" అనగా ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి అని అర్ధం.

ఖాకె షిఫా

ఖాకె షిఫా ను మంగళంగా భావించి కొద్దిగా తినవచ్చు ఆరోగ్యం కోసం. ప్రపంచంలో కర్బలా మట్టి తప్ప మరో ఏ మట్టినైనా తినమని ఉందా చెప్పండి. రివాయతులనుసారం “కర్బలా మట్ట పై సజ్దహ్ చేయడం (మన కళ్ళపై పడి ఉన్న) ఏడు పర్దాలను తీసివేస్తుంది” కర్బలా సంఘటన తరువాత తొమ్మిది మంది ఇమాములు కూడా కర్బలా మట్టి పైనే సజ్దహ్ చేసేవారు.
కర్బలా కన్న ముందు సిఫ్పీన్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా ఇమామ్ అలీ[అ.స] కర్బలాకు చేరుకున్నారు అప్పుడు ఆ నేల నుండి మట్టిని తీసి దాని ముద్దు పెట్టారు, దాని వాసనను పీల్చారు మరియు తన ముఖం పై పెట్టుకున్నారు.[షర్హె నెహ్జుల్ బలగహ్, భాగం3, పేజీ170].
హజ్రత్ ఇబ్రాహీమ్ కర్బలా చేరినప్పుడు అతను జారి నేల పై పడ్డారు, అతని తల నుండి నెత్తురు ప్రవాహం మొదలయ్యింది, దాంతో అతను చాలా నిరాశ చెందారు; (ఎందుకంటే మనిషికి వచ్చే కష్టాలలో అతను చేసుకున్న పాపములకు పరిహారం అని కూడా అంటారు) వెంటనే ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] “ఓ అల్లాహ! నేను ఏ పాపము చేశాను?” అని అడిగారు. ఇలా జవాబు వచ్చింది: కాదు, ఇది కర్బలా భూమి ఇక్కడ రక్తం చిందించబడుతుంది; నీవు మా ప్రత్యేక ప్రవక్త కాబట్టి; నీ నెత్తురు కూడా ఇందులో చిందించాలనుకున్నాను తరువాత చిందించబడే రక్తంలో మీ భాగం కూడా ఉండాలని”[బిహారుల్ అన్వారు, భాగం44, పేజీ243].

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, బీరూత్, లబ్నాన్, 1421 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24