హజ్రత్ ఇల్యాస్[అ.స] ఎవరు?

మంగళ, 11/27/2018 - 19:06

ఖుర్ఆన్ లో ఇల్యాస్ అని గుర్తు చేయబడ్డ ప్రవక్త అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్తలలో ఒకరి పేరా లేక ఇద్రీస్, యహ్యా, ఖిజ్ర్ ప్రవక్తలలో ఎవరో ఒకరిని ఉద్దేశించి సూచించిన పేరా అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

హజ్రత్ ఇల్యాస్[అ.స] ఎవరు?

ఖుర్ఆన్, హజ్రత్ ఇల్యాస్[అ.స] ఒక ప్రవక్త అని స్పష్టంగా వివరించింది. కాని ఇల్యాస్ అన్న పేరు దైవప్రవక్తలలో మరో ప్రవక్త పేరా? లేక అది స్వయంగా వారి పేరేనా? వారి ప్రత్యేకతలు ఏమిటి? అన్న విషయాల పై ఖుర్ఆన్ వ్యాఖ్యులు వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు:
1. కొందరు ఇల్యాస్[అ.స]ను ఇద్రీస్ ప్రవక్త అని భావిస్తారు. ఎందుకంటే “ఇద్రీస్” ను “ఇద్రాస్” అని కూడ పలికేవారు అలా కొంచెం తేడాతో “ఇల్యాస్”గా మారింది అని అంటారు.
2. కొందరు ఇల్యాస్[అ.స] బనీ ఇస్రాయీల్ ప్రవక్తల నుండి ఒకరు, ప్రవక్త మూసా[అ.స] సొదరుడు హారూన్[అ.స] యొక్క మనవడు “యాసీన్” యొక్క కుమారుడు ఇల్యాస్[అ.స] అని కొందరు భావిస్తారు.
3. కొందరు ఇల్యాస్[అ.స]ను హజ్రత్ “ఖిజ్ర్”[అ.స] అని భావిస్తారు.
4. కొందరు ఇల్యాస్[అ.స]ను బనీ ఇస్రాయీల్ కు చెందిన ప్రవక్త. బనీ ఇస్రాయీల్ యొక్క రాజు “ఆజాబ్” యొక్క హిదాయత్ కోసం వారిని అవతరింపజేశాడు, అని భావిస్తారు.
5. కొందరు ఇల్యాస్[అ.స]ను హజ్రత్ యహ్యా[అ.స]గా భావిస్తారు.[తఫ్సీరె నమూనహ్, భాగం19, పేజీ160].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12