హజ్రత్ ఇల్యాస్[అ.స] జీవిత చరిత్ర

మంగళ, 11/27/2018 - 18:57

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్త హజ్రత్ ఇల్యాస్[అ.స] జీవిత చరిత్ర సంక్షిప్తంగా.

హజ్రత్ ఇల్యాస్[అ.స] జీవిత చరిత్ర

హజ్రత్ ఇల్యాస్[అ.స] అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రముఖ ప్రవక్తలలో ఒకరు అన్న విషయంలో సందేహం లేదు. ఎందుకంటే వారిని ఖుర్ఆన్ స్పష్టంగా ప్రవక్త అని సూచించెను. ఖుర్ఆన్: إِنَّ إِلْیاسَ لَمِنَ الْمُرْسَلِینَ అలాగే వారి పేరు మిగతా ప్రవక్త పేర్ల ప్రక్కన ప్రస్తావించింది; وَ زَکَرِیّا وَ یَحْیى وَ عِیسى وَ إِلْیاسَ کُلٌّ مِنَ الصّالِحِینَ
ఖుర్ఆన్ యొక్క ఈ ఆయతుల ప్రకారం హజ్రత్ ఇల్యాస్[అ.స] ఒక వర్గానికి రుజుమార్గం చూపించడానికై అవతరించబడ్డ ప్రవక్తలలో ఒకరు అని తెలుస్తుంది. వారి వర్గంలో ఎక్కువ మంది వారిని అంగీకరించలేదు, వారిని వ్యతిరేకించారు. కాని స్వచ్ఛమైన విశ్వాసులు వారి అనుచరులుగా మారారు. ఖుర్ఆన్ లో వారి పేరు రెండు సార్లు వచ్చింది; సూరయే సాఫ్ఫాత్ యొక్క 123వ ఆయత్ మరియు సూరయే అన్ఆమ్ యొక్క 85వ ఆయత్ లో.
వారి వర్గం పూజించే విగ్రహం పేరు “బఅల్”; ఈ ప్రవక్త “షామాత్” ప్రదేశంలో అవతరించబడ్డారు. వారి ప్రచార కేంద్రం “బఅలబక్” అనబడే పట్టణం. ఈనాడు అది “లెబ్నాన్” యొక్క భాగం అయ్యింది, మరి అది సిరియా సరిహద్దుల్లో ఉంది.[తఫ్సీరె నమూనహ్, భాగం19, పేజీ160].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

MashaAllah....
Jazakallah, thanks for history of prophet Ilyas as.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17