హజ్రత్ ౙుల్ కిఫ్ల్[అ.స]

బుధ, 11/28/2018 - 19:58

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్త హజ్రత్ ౙుల్ కిఫ్ల్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

హజ్రత్ ౙుల్ కిఫ్ల్[అ.స]

హజ్రత్ ౙుల్ కిఫ్ల్[అ.స] పేరు ఖుర్ఆన్ యొక్క అంబియా సూరహ్ లో 85వ సూరహ్ లో హజ్రత్ ఇస్మాయీల్[అ.స], హజ్రత్ ఇద్రీస్[అ.స]ల పేర్లలతో పాటు ప్రస్తావించబడి ఉంది.
కొందరు వారిని బని ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరు, హజ్రత్ అయ్యూబ్[అ.స] కుమారుడని మరియు వారి పేరు “బషర్” లేదా “బషీర్” లేదా “షరఫ్” అని భావిస్తారు. మరికొందరు వారిని “హిజ్ఖీల్” అని, ౙుల్ కిఫ్ల్ వారి బిరుదు అని నమ్ముతారు.
ౙుల్ కిఫ్ల్ పేరుకు కారణం; “ౙుల్” అనగా గలవాడు మరియు “కిఫ్ల్” అనగా భాగ్యం, అలాగే దానికి మరో అర్థం బాధ్యత. వారిని ఎందుకు “ౙుల్ కిఫ్ల్” అంటారు అన్న విషయం పై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి: కొందరు అల్లాహ్ వారికి మంచి భాగ్యాన్ని ప్రసాదించాడు, అందుకని ౙుల్ కిఫ్ల్ అంటారు అనగా “మంచి భాగ్యంగలవాడు” అని అర్థం.
కొందరు, ౙుల్ కిఫ్ల్[అ.స] రాత్రుళ్ళు ప్రార్థనలలో, పగలు ఉపవాసంలో గడుపుతానని మరియు తీర్పు సమయంలో ఆగ్రహించనని ప్రమాణం చేసి దాని పట్ల బాధ్యతగా ఉండడం వల్ల వారికి “ౙుల్ కిఫ్ల్” అనగా “బాధ్యత గలవాడు” అనే బిరుదు వచ్చింది అని భావిస్తారు.[తఫ్సీరె నమూనహ్, భాగం19, పేజీ331].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4