త్రాగుబోతుతో సహవాసం దైవప్రవక్త[స.అ] దృష్టిలో

బుధ, 12/05/2018 - 09:30

త్రాగుబోతును ఇస్లాం అపవిత్రుడు మరియు పాపాత్ముడిగా సూచించింది ఆ ప్రకారం వారితో స్నేహం కూడా సరికాదు. వారితో స్నేహం చేయడం గురించి దైవప్రవక్త[స.అ] ప్రవచించిన హదీసుల వివరణ.

 త్రాగుబోతుతో సహవాసం దైవప్రవక్త[స.అ] దృష్టిలో

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “యూదులకు మరియు క్రైస్తవులకు సలామ్ చేయి కాని త్రాగుబోతుకు మాత్రం సలామ్ చేయకు, ఒకవేళ అతడు నీకు సలామ్ చేస్తే వాడికి జవాబు ఇవ్వకు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ152]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “యూదుల మరియు క్రైస్తవుల పొరుగులో ఉండడం, ఒక త్రాగుబోతు పొరుగులో ఉండడం కన్నా మంచిది. త్రాగుబోతుతో స్నేహం చేయకండి ఎందుకంటే వాడితో స్నేహం నిరంతర బిడియంతో ముడిపడి ఉంటుంది”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ152].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమదినాన్ని విశ్వసిస్తారో వారు మద్యం ఉన్న టేబుల్ పై కూర్చోరు”[బిహారుల్ అన్వార్, 79, పేజీ129].
దైవప్రవక్త [స.అ] ఉల్లేఖనం: “త్రాగుబోతు ఏదైన చెబితే వాటిని సమ్మతించకండి, పెళ్ళిచూపులకు వస్తే వాడికి పల్లనివ్వకండి, వాడికి రోగమొస్తే చూడడానికి వెళ్ళకండి, చచ్చిపోతే వాడ్ని పూడ్చకండి, వాడిని నమ్మి వాడికి వస్తువులను ఇవ్వకండి; మరి ఎవరైతే వాడిని నమ్మి తమ వస్తువులను ఇస్తారో అవి పోతే, అల్లాహ్ వాటి రక్షణ బాధ్యత తీసుకోడు, వాడితో ఏ పని చేయించుకోకండి; ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ సొమ్మును అవివేకుల పరం చేయకండి” త్రాగుబోతులకు మించిన అవివేకులెవరుంటారు?![బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ127].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12