ఆత్మగౌరవం మరియు ఆత్మాభిమానం కలిగి ఉన్న మనిషి గురించి దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] హదీస్.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మనిషికి ఆత్మాభిమానం మరియు ఆత్మగౌరవం ఉండడం చాలా అవసరం. ఆత్మాభిమానం కలిగి ఉన్న మనిషి ప్రతీ ఒక్కరి దృష్టిలో గౌరవం కలిగి ఉంటాడు. అతడు తన ఆత్మగౌరవం తగ్గే పనులు చేయడు, వాటి నుండి దూరంగానే ఉంటాడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం తన నుండి బద్దకం, సోమరితనం మరియు వ్యర్థతనాన్ని దూరంగా ఉంటాడు, అవి దగ్గరకి రాకుండా జాగ్రత్తపడతాడు. ఎవరి ముందు చేతులు చాచడు, తన జీవితం గడపడానికి కష్టపడతాడు. ఆత్మగౌరవం గురించి హదీస్ గ్రంథాలలో చాలా హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇక్కడ కేవలం ఒక హదీస్ మీ కోసం:
ఇమామ్ అలీ[అ.స] ఆత్మగౌరవం కలిగి ఉన్న వ్యక్తి గురించి ఇలా ప్రవచించెను: “నీ ఆత్మను అన్ని రకాల అగౌరవాల నుండి దూరంగా ఉంచు, ఆ అగౌరవం మరియు దిగజారడం నీకు అతి ఇష్టమైన వస్తువు దక్కుతుంది అన్న సరే. ఎందుకంటే నీవు ఆ పనితో పోగొట్టుకున్న నీ ఆత్మగౌరవరం తిరిగి రాదు. జాగ్రత్త! ఎవ్వరి బానిస అవ్వకు అల్లాహ్ నిన్ను స్వేచ్ఛిగా సృష్టించాడు”[బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ227]
రిఫ్రెన్సె
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, ఇంతెషారాతె మొఅస్ససతుల్ వఫా, బీరూత్, లెబ్నాన్, 1404హి.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya .. Iltemase dua.
MashaAllah
Shukriya... Jazakallah.
వ్యాఖ్యానించండి