.దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] జ్ఞానం మరియు ధనంల మధ్య గల తేడాను వివరించారు.
ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] జ్ఞానం మరియు ధనం గురించి ఇలా ప్రవచించారు:
జ్ఞానం దైవప్రవక్తల ఆస్తి, ధనం ఫిర్ఔనుల ఆస్తి
జ్ఞానం జ్ఞానిని కాపాడుతుంది కాని ధనవంతుడు ధనాన్ని కాపాడుకుంటాడు.
జ్ఞానం ఉపయోగిస్తే పెరుగుతుంది కాని ధనం తరుగుతుంది.
జ్ఞానం అన్నిచోట్ల మనిషితో పాటు ఉంటుంది చివరికి సమాధిలో కూడా కాని ధనం బయటే ఉండిపోతుంది.
జ్ఞానం కేవలం విశ్వాసులకు ప్రత్యేకించబడినది వారికే దక్కుతుంది కాని ధనం అవిశ్వాసుల చేతికీ వస్తుంది మరియు విశ్వాసుల చేతికీ వస్తుంది.
జ్ఞాని యొక్క జ్ఞానం మతానికి సంబంధించిన ప్రతీ విషయంలో అవసరం కాని ధనం అలా కాదు.
జ్ఞానం పులే సిరాత్ పై నడిచేటప్పుడు శక్తిని ప్రసాదిస్తుంది కాని అప్పుడు ధనం దేనికీ పనికి రాదు(కేవలం ఆ ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చుపడితే తప్ప).[మీజానుల్ హిక్మహ్, భాగం6, పేజీ454, హదీస్13385]
రిఫ్రెన్స్
మీజానుల్ హిక్మహ్, భాగం6, పేజీ454, హదీస్13385, దఫ్తరె తబ్లీగాతె ఇస్లామీ, 1362.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya.. Iltemase Dua.
వ్యాఖ్యానించండి