.ఖుర్ఆన్ పట్ల విశ్వాసం గురించి షేఖ్ రజా అల్ ముజఫ్ఫర్ తన పుస్తకం “అఖాయిదుల్ ఇమామియాహ్”లో ఇలా వ్రాశారు.

షేఖ్ రజా అల్ ముజఫ్ఫర్ తమ పుస్తకం “అఖాయిదుల్ ఇమామియాహ్”లో ఇలా వ్రాశారు: ఖుర్ఆన్ పట్ల మా విశ్వాసం “అది దైవవాణి. అల్లాహ్ తరపు నుండి అవతరించబడినది. అందులో ప్రతీ దాని గురించి ప్రస్తావించి ఉంది. ఖుర్ఆన్ మన దైవప్రవక్త[స.అ] యొక్క ఇప్పటి వరకు, మరి ఇప్పటికీ ఎప్పటికీ మిగిలి ఉండే అద్భుతకృత్యము. మనిషి దానికి పోలినది తీసుకు రాలేనటువంటి దాని సమయోచిత భాషణము మరియు అనర్గళత్వము, అందులో ఉన్న యదార్ధాలకు మరియు అతి ఉత్తమ జ్ఞానానికి జవాబు అసాధ్యం, అందులో ఎటువంటి మార్పులు మరియు తహ్రీఫ్ జరగడం అసాధ్యం. మా వద్ద ఉన్న మరియు నిరంతరం మేము పఠించే ఈ ఖుర్ఆన్ దైవప్రవక్త[స.అ] పై అవతరించిన ఖుర్ఆనే. మరియు ఇలా అని విశ్వసించని వాడు అసత్యుడు, ఇజ్మాను పాడు చేస్తున్నాడు, ప్రజలను దారి తప్పిస్తున్నాడు, లేదా అతడు సందేహానికి గురి అయ్యాడు. ఇలాంటి వ్యాజ్యం చేసేవారు దారితప్పినవారు అయి ఉంటారు, ఎందుకంటే ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క ప్రవచనముల సమూహం అందులో ముందు నుంచి గాని లేదా వెనక నుంచి గాని మిథ్యకు చోటు లేదు”
రిఫ్రెన్స్
షేఖ్ రజా అల్ ముజఫ్ఫర్, అఖాయిదుల్ ఇమామియాహ్.
వ్యాఖ్యానించండి