షాబాన్ మాసపు ప్రత్యేకత

గురు, 04/04/2019 - 18:24

ఈ షాబాన్ మాసము విశ్వాసులకు చాల ప్రత్యేకము ఎందుకంటే పవిత్ర రమజాను మాసంలోకి ప్రవేసించటానికి తమను అర్హులుగా చేసుకోవటానికి ఈ మాసము ఒక అవకాసమని చెప్పవచ్చు.

షాబాన్ మాసపు ప్రత్యేకత

షాబాను మాసము అల్లాహ్ దాసులు అతనిని ప్రార్ధించి అతనితో మొరపెట్టుకునే మాసము.ఈ మాసము పవిత్ర రమజాను మాసములోకి ప్రవేశించుటకు భక్తులు తమను తాము శుద్ధీకరించుకునే మాసము.పాపాలను వదిలి,నిర్లక్ష్యపు వైఖరిని మార్చుకోవటానికి,షైతాను నయవంచనలను పక్కనపెట్టడానికి ఈ షాబాను మాసము దేవుడిచ్చిన ఒక చక్కటి అవకాసమని చెప్పవచ్చు. ఈ మాసము దైవప్రవక్త(స.అ.వ)ల వారికి ప్రత్యేకం.ఎందుకంటే వారు ఈ మాసాన్ని తనతో ప్రత్యేకించుకున్నారు. దానికి షాబాన్ మాసంలో మనము చదివే సలవాతే నిదర్శనం.ఆ సలవాతులో మనము ఈ విధంగా పలుకుతాము: “హాజా షహ్ రు నబియ్యిక సయ్యదో రుసులిక” (ఈ మాసము నీ ప్రవక్త మరియు ప్రవక్తలందరికి నాయకుడు యొక్క మాసము).ఎలగైతే షాబాన్ మాసంలో ఉపవాసాలకు ప్రాముఖ్యత ఉన్నదో అదే విధంగా ఈ మాసంలో రాత్రులు ప్రార్ధనలలో గడపమని కూడా తాకీదు చేయటం జరిగింది.దైవప్రవక్త(స.అ.వ)ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ఎవరైతే ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా రాత్రులతో పాటు నీమే షాబాన్(షాబాన్ మాసపు 15వ తారీకు) యొక్క రాత్రిని ప్రార్ధనలలో గడుపుతారో వారి యొక్క హ్రుదయాలు ఏనాడైతే అన్ని హృదయాలు మరణిస్తాయో వారి హృదయాలు మ్రుత్యువు బారిన పడవు(సజీవంగా ఉంటాయి).

రెఫరెన్స్: సవాబుల్ ఆమాల్,2వ భాగము,పేజీ నం:102.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27