షబే నీమయే షాబాన్ ప్రతిష్టత గురించి చాలా రివాయత్లు ఉన్నాయి. అది ఒక ప్రత్యేక రాత్రి.
షాబాన్ మాసం యొక్క 14వ తారీఖు రాత్రిని “షబే నీమయే షాబాన్”(అనగ అర్ధ షాబాన్ మాసం యొక్క రాత్రి) అని అంటారు. ఈ రాత్రిని “షబే బరాత్” అని కూడా అంటారు. మాసూమీన్]అ.స[ల రివాయత్ లలో ఈ రాత్రి జాగరణ చేయాలని తాకీదు చేయబడి ఉంది.
ఇమామ్ జాఫరె సాదిఖ్]అ.స[ ఉల్లేఖనం: ఇమామ్ ముహమ్మద్ బాఖిర్]అ.స[తో “షబే నీమయే షాబాన్” గురించి అడిగినప్పుడు వారు ఇలా ఉల్లేఖించారు: “ఈ రాత్రి ‘షబే ఖద్ర్’ తప్ప అన్ని రాత్రుల పై ప్రతిష్టత గల రాత్రి, అందుకని ఈ రాత్రిని అల్లాహ్ సామిప్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఈ రాత్రి అల్లాహ్ తన దాసులను కరుణించి వారి పాపములను క్షమిస్తాడు. ఈ రాత్రి ఎవ్వరినీ ఉట్టిచేతులతో పంపను కేవలం పాపమునకు సంబంధించిన కోరికలు గల వారిని తప్ప, అని అల్లాహ్ స్వయంగా తన పై ప్రమాణం చేశాడు.(మఫాతీహుల్ జినాన్)
ఈ రాత్రంతా నమాజ్, దుఆ మరియు అస్తగ్ఫార్ చేస్తూ జాగరణ చేయడం వల్ల అతిగా పుణ్యం లభిస్తుంది. ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ఉల్లేఖనం: “ఎవరైతే ఈ రాత్రి జాగరణ చేస్తాడో, అందరి హృదయాలు అజీవంగా ఉండే రోజున అతడి హృదయం జీవముగా ఉంటుంది”[మఫాతీహుల్ జినాన్, షాబాన్ ఆమాల్ అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, షాబాన్ ఆమాల్ అధ్యాయంలో.
వ్యాఖ్యలు
Mashallah
Jazaakallah...
వ్యాఖ్యానించండి