మృత్యువు యొక్క స్మరణం ద్వారానే మనిషికి ఇహపరలోకాలలో విజయం ప్రాప్తిస్తుంది .
అనంతకరునమయుడు అపారకృపాసీలుడైన అల్లహ్ పేరిట
ఇస్లాం ధర్మంలో మృత్యువును మరవకూడదు ఎల్లప్పుడూ దానిని గుర్తుంచుకోవాలి అని చాలా చోట్ల చాలాగట్టిగా చెప్పటం జరిగింది. దాని ప్రయోజనాలు కూడా ప్రస్థావించబడ్డాయి, అందుకే ఇహపరలోకాలలో లాభం సమకూరాలంటే మృత్యువు యొక్క స్మరణ చాలా అవసరం, మృత్యువు గురించి ఇమాం జాఫరే సాదిఖ్(అ.స)ల వారిని ప్రశ్నించినప్పుడు ఆయన మృత్యువును గుర్తుంచుకోవడంలో ఉన్న ఏడు ప్రయోజనాలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు:
"ذکر الموت یمیت الشھوات فی النفس و یقلع منابت الغفلۃ و یقوی القلب بمواعد اللہ و یرق الطبع ،و یکسر اعلام الھوی و یطفی نار الحرص،و یحقر الدنیا"
మృత్యువు స్మరణ: 1. శారీరకసంబంధమైన కోరికలను చంపుతుంది, 2. నిర్లక్ష్యం నుంచి మేలుకోలిపిస్తుంది, 3. హృదయాన్ని అల్లాహ్ పట్ల చెయబడ్డ వాగ్దానాల తాలూక బలపరుస్తుంది, 4. మనిషి యొక్క మానసిక స్తితి మృదులంగా మారుతుంది, 5. మనిషి యొక్క ఇచ్చలను నసింపజేస్తుంది, 6. తీవ్రమైన మనోవాంచలను తొలగిస్తుంది, 7. లోకం పట్ల హీనమైన భావం కలిపిస్తుంది.
పైన ఏవిధంగానైతే ఇమాం సాదిఖ్(అ.స)ల వారు చెప్పినట్టు మనం కూడా అమలు చేస్తే జీవితంలో కష్టాలు మన దరిదాపులలోకి కూడా రావు. మృత్యువు యొక్క స్మరణ ద్వార మనిషి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎటువంటి కష్టాల బారిన పడడు.[బిహారుల్ అన్వార్, భాగం6, పేజీ133]
రిఫరెన్స్:
బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసి, దారుల్ అహ్యా, బేరూత్.
వ్యాఖ్యానించండి