ఏడు ఆకాశాముల పేర్లూ మరియు వాటి రంగులు వివరిస్తున్న ఇమామ్ యొక్క హదీస్ ఉల్లేఖనం.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మస్జిదె కూఫాలో ఉండగా “షామ్”కు చెందిన ఒక వ్యక్తి నిలబడి వారితో కొన్ని ప్రశ్నలు అడిగాడు, వాటి నుండి ఇదొకటి: “యా అమీరల్ మొమినీన్! ఆకాశం యొక్క పేర్లు మరియు వాటి రంగుల గురించి నాకు తెలియపరచండి”. ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు:
1. క్రిందకున్న ఆకాశం పేరు “రఫీ” అది నీరు మరియు పొగతో ఉంది
2. రెండవ ఆకాశం పేరు “ఖైదూమ్” దాని రంగు రాగి రంగు
3. మూడవ ఆకాశం పేరు “మారూమ్” దాని రంగు ఇత్తడి రంగు
4. నాలుగవ ఆకాశం పేరు “అర్ఖలూన్” దాని రంగు వెండి రంగు
5. ఐదవ ఆకాశం పేరు “హైఫూన్” దాని రంగు బంగారం రంగు
6. ఆరవ ఆకాశం పేరు “అరూస్” దాని రంగు పచ్చయాఖూత్ రంగు
7. ఏడవ ఆకాశం పేరు “ఉజమా” దాని రంగు తెల్ల దుర్ర్(రాయి పేరు) రంగు.[ఖిసాల్, భాగం2, పేజీ13].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
వ్యాఖ్యానించండి