గురు, 09/05/2019 - 02:20
ప్రపంచం ఒక పరీక్షా నిలయం, దాని సుఖదుఖాలను ఎదురుకొని విశ్వాస పరంగా ముందుకు సాగిపోవటమే జీవితం..
ఈ ప్రపంచం ఒక పరీక్షా నిలయం, ఇక్కడ రోగాల, ధనం కొరతా, నిండు యవ్వనంలో కొడుకు మరణం, తప్పుడు నుందలు, చెడు ఇరుగుపొరుగు మొ.. రూపాలలో పరీక్షించబడతారు. ఈ ప్రపంచం విత్తనాలు నాటే చోటు, దానితో పాటు పరీక్ష కూడా ఉంది. సుఖదుఖాలలోనూ సహనంగా ఉండి ముందుకు నడిచేవారే విజయవంతులు. ఒక్కోసారి మనిషి వద్ద ధనం ఉంటుంది, ఒక్కోసారి ధనం ఉండదు. ఒకవేళ ధనంతో పరీక్షించబడితే కృతజ్ఞత చేయాలి, ఒకవేళ పేదరికంతో పరీక్షించబడితే సహమంగా ఉండాలి. ప్రతీ సమయం అల్లాహ్ తరపు నుండి పరీక్ష జరుగుతూనే ఉంటుంది, దాని స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: "మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను"[ముల్క్:02]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి