ఈ ప్రాపంచిక జీవితం దాని స్వాధిష్టములు మరియు దాని ఆనందములు ఎప్పటికి శాస్వతం కాదు, ఆ అల్లాహ్ మాత్రమే ఈ భూమండలంపై అస్తిత్వం గలవాడు.
మనవుడు ఈ లోకంలో వీక్షించే ఏ వస్తువు శాస్వతం కాదు ఇదే విషయాన్ని వివరించేందుకు ఆ అల్లాహ్ ప్రవక్తలను మరియు ఆ దైవ గ్రంధాలను అవతరింపజేసాడు,రోజూ మన చుట్టూ సంభవించే ఎన్నొ సంఘటనలే దీనికి సాక్ష్యం చెబుతాయి.
ప్రతీ ప్రాణీకి మ్రుత్యువు రుచి చూడవలసిందే:
ఈ ప్రాపంచిక జీవితమే సర్వస్వంగా భావించే ఆ మానవుని సంభొదిస్తూ దివ్యఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నది:
كُلُّ نَفْسٍۢ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ ٱلنَّارِ وَأُدْخِلَ ٱلْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا مَتَٰعُ ٱلْغُرُورِ
అనువాదం: ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించ బడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు [ఆలె ఇమ్రాన్/185].
ప్రాపంచిక జీవితం యొక్క ఉపమానం:
ٱعْلَمُوٓا۟ أَنَّمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا لَعِبٌۭ وَلَهْوٌۭ وَزِينَةٌۭ وَتَفَاخُرٌۢ بَيْنَكُمْ وَتَكَاثُرٌۭ فِى ٱلْأَمْوَٰلِ وَٱلْأَوْلَٰدِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ ٱلْكُفَّارَ نَبَاتُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصْفَرًّۭا ثُمَّ يَكُونُ حُطَٰمًۭا ۖ وَفِى ٱلْءَاخِرَةِ عَذَابٌۭ شَدِيدٌۭ وَمَغْفِرَةٌۭ مِّنَ ٱللَّهِ وَرِضْوَٰنٌۭ ۚ وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا مَتَٰعُ ٱلْغُرُورِ
అనువాదం: బాగా తెలుసుకోండి! ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటు కోవటం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. (దీని) ఉపమానం వర్షపునీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపువన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది, అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు [అల్ హదీద్/20].
తన ద్రుష్టిలో ఈ ప్రపంచమునకు[ప్రాపంచిక జీవితానికి] గల విలువను ప్రస్థావిస్తూ ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఆ అల్లాహ్ తోడు!ఈ ప్రపంచం[ప్రాపంచిక జీవితం] అనేకమైన నిషిధ్ధించబడిన మరియు అపవిత్రమైన వస్థువులతో నిండి ఉన్నది నా ద్రుష్టిలో అది కుష్తిరోగి యొక్క చేతిలోని ఒక పంది ఎముక కన్నా అది చాలా నీచమైనది[నెహ్జుల్ బలఘ,హిక్మత్ నం:236].
వ్యాఖ్యానించండి