.దైవప్రవక్త[స.అ] తనను అన్ని విధాలుగా హింసించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించే మనసుగల వారు.
అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్[స.అ] పై వారు దైవప్రవక్తగా ఎన్నుకొబడిన తరువాత ముష్రికీనుల తరపు నుండి చాలా కష్టాలను ఎదురుకున్నారు, చాలా హింసలను సహించారు, కాని ఇస్లాం ప్రచారం కోసం దౌత్యకార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేందుకు చాలా బలంగా సహనంతో ఉన్నారు, వారికి అన్యాయం చేసిన వాళ్ళందరిని మరియు వారిని హింసించిన వాళ్ళందరినితో ప్రతీకారం తీసుకోవడానికి బదులు వాళ్ళని పెద్దమనసుతో క్షమించారు.
ఫత్హె మక్కా అనగా ఇస్లాం యొక్క అతి పెద్ద శత్రుసైన్యం పై విజయవంతం అవ్వడం. ఆ విజయం ఇస్లాంకు సొంతం అయినప్పుడు అందురు ఇక దైవప్రవక్త ఎంతకాదన్నా అతనిని చాలా ఎక్కువగా కష్టపెట్టిన అబూసుఫ్యాన్ మరియు హిందాను చంపేస్తారు అని అనుకున్నారు, కాని దైవప్రవక్త[స.అ] చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేసిన వాటిని క్షమించి తన సహాబీయులను “జాగ్రత్త! వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు” అని ఆదేశించారు.
అలాగే ఇలా కూడా ఉల్లేఖించబడి ఉంది: “వహ్షీ” పేరు గల మనిషి “ఒహద్” యుద్ధంలో దైవప్రవక్త[స.అ] పినతండ్రి అయిన హంజాను చంపాడు దాని వల్ల దైవప్రవక్త[స.అ] చాలా బాధ కలిగింది అయినా సరే ఫత్హె మక్కా తరువాత అతడిని చంపకుండా వదిలేశారు.
[ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్త[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో.
వ్యాఖ్యానించండి