హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టత సహాహ్ గ్రంథాలలో

గురు, 11/07/2019 - 15:53

హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టత సహాహ్ గ్రంథాలలో ఉంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టత సహాహ్ గ్రంథాలలో

“సహాహ్” మరియు “మసానీద్‌” గ్రంథాలలో హజ్రత్ అలీ[అ.స] పట్ల దైవప్రవక్త[స.అ]కు ఉన్న ప్రేమ మరియు అతనికి సహాబీయులందరిపై ఉన్నత స్ధానం ప్రసాదించిన తీరు సంక్షిప్తంగా: ఉదాహారణకు:
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “ఓ అలీ[అ.స] నాతో నీ పోలిక, మూసాతో హారునుకున్నటువంటిది, కేవలం తేడా ఏమిటంటే నా తరువాత ఇక దైవప్రవక్త లేరు”.[సహీ బుఖారీ, భాగం 2, పేజీ 305]
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “నేను నీ నుండి మరి నువ్వు నా నుండివి”.[సహీ బుఖారీ, భాగం2, పేజీ76]
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “అలీ[అ.స] పట్ల ప్రేమ విశ్వాసానికి నిదర్శనమైతే అతని పట్ల ద్వేషం వైరానికి నిదర్శనం”.[సహీ ముస్లిం, భాగం 1, పేజీ 65]
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “నేను విజ్ఞాన పట్టణమైతే అలీ[అ.స] ఆ పట్టణానికి ద్వారం లాంటివారు”.[సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 201]
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “అలీ[అ.స] నా తరువాత ప్రతీ మొమిన్ కి స్వామి(వలీ)”.[ముస్నదు అహ్మద్, భాగం 5, పేజీ 25]
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “ఎవరికైతే నేను స్వామినో వారికి ఈ అలీ[అ.స] కూడా స్వామియే, ఓ అల్లాహ్ అలీ[అ.స]ని ఇష్టపడేవారిని నీవు ఇష్టపడు, అతనిని ద్వేషించే వారిని నీవు ద్వేషించు”.[సహీ ముస్లిం, భాగం2, పేజీ 362]

రిఫ్రెన్స
సహీ బుఖారీ, భాగం 2, పేజీ 305/సహీ బుఖారీ, భాగం2, పేజీ76/సహీ ముస్లిం, భాగం 1, పేజీ 65/సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 201/ముస్నదు అహ్మద్, భాగం 5, పేజీ 25/సహీ ముస్లిం, భాగం2, పేజీ 362.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30