.అల్లాహ్, సహాబీయులందరిలో హజ్రత్ అలీ[అ.స]కే ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించాడన్న విషయాన్ని ఒక ఆయత్ మరియు రివాయత్ ద్వార నిదర్శించబడింది.
అందరిలో కన్న జ్ఞానవంతులు, ధైర్యశాలి మరియు బలవంతుడు అయ్యి ఉండడం నాయకత్వానికి అవసరం అనే విషయం పట్ల ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది:
قَالُوٓاْ أَنَّىٰ يَكُونُ لَهُ ٱلۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ أَحَقُّ بِٱلۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةٗ مِّنَ ٱلۡمَالِۚ قَالَ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰهُ عَلَيۡكُمۡ وَزَادَهُۥ بَسۡطَةٗ فِي ٱلۡعِلۡمِ وَٱلۡجِسۡمِۖ وَٱللَّهُ يُؤۡتِي مُلۡكَهُۥ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ
అనువాదం: ...వారు ఇలా అన్నారు: “మా పై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కూ, అర్హతలూ అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, అతడు శ్రీమంతుడు కాదు”. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నారు: “మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు”. అల్లాహ్ అతనికి బుద్ధిబలాన్నీ, కండబలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్‌కు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు.[అల్ బఖర సూరా:2, ఆయత్:247]
అల్లాహ్, సహాబీయులందరిలో హజ్రత్ అలీ[అ.స]కే ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించాడు, అందుకే దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “అలీ[అ.స] విజ్ఞాన పట్టణానికి ద్వారం” మరియు దైవప్రవక్త[స.అ] మరణాంతరం సహాబీయులు ఆశ్రయించే ఒకగానొక వ్యక్తి వారే.
వ్యాఖ్యలు
جزاک اللہ
بہت بہت عمدہ ہے ماشا اللہ
మీ అముల్య సమయాన్ని మా సైట్ ను చూడడానికి కేటాయించినందుకు ధన్యవాదములు.
వ్యాఖ్యానించండి