ఇమాం సాదిఖ్[అ.స] హదీసులలో దైవప్రవక్త[స.అ.వ]

బుధ, 11/13/2019 - 19:22

దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఇమాం సాదిఖ్[అ.స] ల వారి హదీసులలో.

దైవప్రవక్త,ముహమ్మద్,ఇమాం సాదిఖ్.

ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: దైవప్రవక్త[స.అ.వ] ల వారు “సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు ప్రకాసించే తన కాంతి నుండి నన్ను సృష్టించాడు” అని అన్నారు. ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: అప్పుడు అల్లాహ్ తన ప్రవక్తను సంభొదిస్తూ ఈ విధంగా పలికాడు: “ఓ ముహమ్మద్! నేను ఆకాశాన్ని,భూమిని,లోకాన్ని,సముద్రాలను సృష్టించే ముందు నీ యొక్క మరియు అలి యొక్క జ్యోతులను  సృష్టించాను”. కల్బీ ఈ విధంగా చెబుతున్నాడు: నాతో ఇమాం సాదిఖ్[అ.స] ల వారు దైవవాణిలో దైవప్రవక్తల వారి ఎన్ని పేర్లు ప్రస్థావించబడ్డాయి? అని ప్రశ్నించారు.దాని నేను “రెండు లేదా మూడు పేర్లు” అని జవాబిచ్చాను.దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారు పది పేర్లు దివ్యఖురానులో ప్రస్థావించబడ్డాయి: “ముహమ్మద్,అహ్మద్,అబ్దుల్లాహ్,తాహా,యాసీన్,నూన్,ముజమ్మిల్,ముద్దస్సిర్,రసూల్ మరియు జిక్ర్”.ఆ తరువాత ఇమాం ల వారు ప్రతీ పేరుకు ఒక ఆయతు పఠించారు. ఎప్పుడైనా ఇమాం[అ.స] ల వారి ముందు దైవప్రవక్త[స.అ.వ] ల వారి పేరు పలికితే దానికి పట్ల ఉన్న గౌరవంతో ఇమాం ల వారు తమ ముఖాన్ని క్రిందికి చేసుకుని వంగేవారు.ఎంత క్రిందకు అంటే వారి తల నేలకు రాసుకుంటుందేమో అనిపించేది. హుసైన్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: నేను ఇమాం సాదిఖ్[అ.స] ల వారితో దైవప్రవక్త ఆదం[అ.స] సంతానానికి నాయకులా?అని ప్రశ్నించాను.దానికి ఇమాం[అ.స] ల వారు “ఆ దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను వారు ఆ దేవుని మొత్తం సృష్టికి నాయకులు,ఆ దేవుడు సృష్టిలో ఏ ఒక్క జీవిని వారి కన్నా గొప్పగా సృష్టించలేదు” అని అన్నారు.

రెఫరెన్స్: జిలా ఉల్ ఉయూన్,పేజీ నం:11,ఉసూలె కాఫి,2వ భాగం,పేజీ నం: 325,మనాఖిబ్,1వ భాగం,పేజీ నం:150. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9