దైవప్రవక్త[స.అ.వ] ల వారి కొన్ని విశేషగుణాలలో కొన్నింటిని ఇచట ప్రస్థావించటం జరిగింది.
ఒక రాజ్యానికి,ఒక దేశానికి లేదా ఒక సమూహానికి నాయకుడున్నాడంటే అతను ఆ అర్హతను సాధించడానికి కారణం అతనిలో ఉండే నాయకత్వపు లక్షణాలు మరియు సుగుణాలే కారణం.లేకపోతే అతను ఆ అర్హతను తొందరగా కోల్పోతాడు.అలాగే ఈ నాడు ఇస్లాము ప్రపంచం నలుమూలలా విస్తరించటానికి కారణం మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారి విశేష గుణాలే.వారి అన్ని గుణాలను వివరించటం మనిషికైతే సాధ్యం కాని పని. వాటిని ఆ అల్లాహ్ యే స్వయంగా దైవవాణిలో వివరిస్తున్నాడు.వాటిలో మొదటిది దైవప్రవక్త[స.అ.వ] ల వారు మానజాతిని ఋజుమార్గాన్ని చూపటానికి వారు పడే తపన. దైవప్రవక్త[స.అ.వ] ల వారు తన ముస్లిం ఉమ్మత్ కోసం పడే తపన ఎలాంటిదంటే అల్లాహ్ వారిని ఓదార్చుతూ ఈ విధంగా సెలవిస్తున్నాడు: [ఓ ముహమ్మద్!] ఒక వేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నీవు వారి వెనుక దుఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలను పోగొట్టుకుంటావా ఏమి?[అల్ కహఫ్/6]. ఇతరులపై వారు చూపే దయ,ప్రేమ,వారి మన్నించే లక్షణం కూడా వారి సుగుణాలలో ముఖ్యమైనవి.మక్కాను జయించిన తరువాత తనను బాధించి,మక్కాను వదిలి వెళ్ళటానికి కారణమైన మక్కా వాసులు దండయాత్ర చేస్తే వారి ప్రాణాలు ఎక్కడ పోతాయో లేదా ఒక వేళ బ్రతికినా ఖైదీలుగా ఉండాలేమోనన్న భాయాందోళనలకు గురవుతున్న సమయంలో “ఈ రోజు మీకు ఎటువంటి శిక్ష విధించబడదు ఆ భగవంతుడు అందరిని క్షమిస్తాడు అతను కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడు.వెళ్ళండి మీరందరు విముక్తిని పొందారు” అని అన్నారు. వారు ఆ దేవుని ప్రార్ధనకు కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చే వారు.అర్ధరాత్రి వరకు వారి ప్రార్ధనలు కొనసాగేవంటే వారు దానికి ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది.అల్లాహ్ తన దైవ వాణిలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఓ వస్త్రమును కప్పుకున్నవాడా! కొద్దిసేపు మిణా రాత్రంతా నమజులో నిలబడు.సగం రాత్రి లేదా దానికంతే కొంచెం తక్కువ చేసుకో లేదా దానిని మరికొద్దిగా పెంచుకో”[అల్ ముజ్జమ్మిల్/1-4].
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,21వ భాగము,పేజీ నం:107.
వ్యాఖ్యానించండి