ఇమామ్ ఒక సాధారణ మనిషా లేక వారికి కూడా ప్రత్యేకతలుంటాయా అన్న అంశం పై సంక్షిప్త వివరణ...
ప్రవక్త తరువాత దీన్ ను కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్లె వాడిని ఇమామ్ అంటారు. దీన్ యొక్క ఉపదేశాలను పొల్లుతగ్గకుండా మిగిలి ఉండే విధంగా ఉంచటం మరియు ప్రజలను దీన్ వైపుకు పిలుపునివ్వటం ఇమామ్ యొక్క బాధ్యత.
ప్రవక్తల వలే ఇమామ్ కూడా తప్పకుండా మాసూమ్(ఎటువంటి తప్పచేయని పవిత్రుడు) అయి ఉంటాడు. ఇమామ్ కూడా ప్రవక్తల వలే చిన్నప్పటి నుండి జ్ఞాని అయి ఉంటాడు. హలాల్ హరామ్ పట్ల కట్టుబడి ఉంటాడు.
ఇమాములు పన్నెండు మంది. వారిని అల్లాహ్ యే దైవప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ] యొక్క ఖలీఫా మరియు ఉత్తరాధికారులుగా నియమించాడు. మరి వారే షరీఅత్ యొక్క సంరక్షకులు.
మన ప్రవక్త మిగిలిన ప్రవక్తలందరి పై ప్రతిష్ఠత గలవారు మరియు పన్నెండు మంది ఇమాములు వారి ఉత్తరాధికారులు, అందుకని ఈ పన్నెండు మంది ఇమాములు కూడా మన ప్రవక్త తరువాత ప్రజలందరి పై ప్రతిష్ఠత గల మరియు గొప్పవారు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి