హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క ప్రతిష్టతలతో కూడి ఉన్న "మనాఖిబె ఇబ్నె మర్దవియ్యహ్" గ్రంథం గురించి సంక్షిప్తంగా.
గ్రంథం పేరు: మనాఖిబు అలీ ఇబ్నె అబీతాలిబ్(మనాఖిబె ఇబ్నె మర్దవియ్యహ్ పేరుతో ప్రఖ్యాతి చెందినది) రచయిత: అహ్మద్ ఇబ్నె మూసా ఇబ్నె మర్దవియ్యహ్ ఇస్ఫహానీ(మరణం:410హిజ్రీ).
ఈ గ్రంథ రచయిత అహ్లెసున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ ముహద్దస్(హదీస్ ఉల్లేఖి), ఇతను “హాఫిజ్”గా ప్రఖ్యాతి చెందినవారు. ఇతను ఈ గ్రంథంలో హజ్రత్ అలీ[అ.స] యొక్క ప్రతిష్టతలను ఉల్లేఖించారు. ఈ గ్రంథం యొక్క ఒక భాగాన్ని హజ్రత్ అలీ[అ.స] యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అవతరించబడిన ఆయతులకు ప్రత్యేకించారు. రచయిత ఈ గ్రంథాన్ని 22 అధ్యాయములలో హజ్రత్ అలీ[అ.స] యొక్క బిరుదులు, కున్నియత్ పేర్లు, వారి విశ్వాసం, వారి జ్ఞనం, వారి ధర్మనిష్ఠ, వారి ఔదార్యం, వారి ధైర్యసాహసాలు మొదలగు వాటి గురించి రచించారు. అందులో “హదీసె తైర్”, “హదీసె రద్దుష్ షమ్స్”, “హదీసె సద్దె అబ్వాబ్” లాంటి హదీసులను కూడా ఉల్లేఖించారు.[మనాఖిబె అలీ ఇబ్నె అబీతాలిబ్, ముఖద్దమయె కితాబ్]
రిఫ్రన్స్
ఇబ్నె మర్దవియ్యహ్, మనాఖిబె అలీ ఇబ్నె అబీతాలిబ్, దారుల్ హదీస్, ఖుమ్, 1424ఖ.
వ్యాఖ్యానించండి