ఒక నమాజీ యొక్క లక్షణాలు

గురు, 12/12/2019 - 11:26

ఒక నిజమైన నమాజీ యొక్క లక్షణాలు దైవఖురాను మరియు హదీసుల ఆధారంగా.

నమాజు,లక్షణాలు,దివ్యఖురాను.

నమాజును అందరూ చేస్తారు కానీ ఒక నమాజీకి ఉండవలసిన ప్రత్యేకతలేమిటి?ఒక నమాజీ యొక్క లక్షణాలు ఏమిటి? అన్నది కూడా తెలుసుకోవటం అవసరం.దివ్యఖురాను మరియు హదీసులలో చాలా చోట్ల ఒక నిజమైన నమాజీ యొక్క లక్షణాలు ప్రస్థావించబడ్డాయి.వాటిలో ఒకటి నమాజీ అనే వాడు ఆ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండి, పాపాలకు దూరంగా ఉండవలెను. దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్జించండి. నిజంగా ఇది కష్టమైన పనే. కానీ(అల్లాహ్ కు) భయపడేవారికి(ఇది సులువైన పని)”.[అల్ బఖర/45]. సద్ఖా మరియు దైవమార్గంలో ఖర్చుపెట్టడం కూడ ఒక నిజమైన నమాజీ యొక్క లక్షణమని దివ్యఖురాను చెబుతుంది: “(ఓ ప్రవక్తా!) క్రయావిక్రయాలుగానీ,స్నేహబంధాలుగాని,ఉండని రోజు రాక ముందే నమాజులను నెలకొల్పమని,మేము ప్రసాదించిన దానిలో నుంచి గొప్యంగానూ,బహిరంగంగానూ ఖర్చుపెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు”[ఇబ్రాహీం/31]. పూర్తి శ్రద్ధతో ఆ దేవుని సన్నిధిలో నిలబడి ఆ దేవునిని దీనంగా,గోప్యంగా విన్నవించుకోవటం.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “నీవు ఆ దేవునిని చూస్తున్నట్టుగా ప్రార్ధించు ఒక వేళ నువ్వు అతనిని చూడకపోయినా ఆ భగవంతుడు నిన్ను చూస్తున్నాడు”. తమ నమాజులను షైతాను బారినుండి కాపాడుకోవటం.దివ్యవాణిలో అల్లాహ్ తన విశ్వాసుల లక్షణాలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు” [మొమినూన్/9].

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,74 వ భాగము,74వ పేజీ,కితాబుర్ రౌజా,హదీసు నం:3.

 

 

 

 

 

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10