అన్ని సమస్యలకు పరిష్కారం చూపే వాడు కేవలం ఆ అల్లాహ్ ఒక్కడే, అతని సన్నిధిలో ఆ సమస్యలను పరిష్కరించ గలిగే వాడే నిజమైన విశ్వాసుడు.

అల్లాహ్ దివ్యఖురాన్ ను మానవుని అన్ని సమస్యలకు పరిష్కారాలను అందులో పొందుపరచి తన ప్రవక్తపై అవతరింపచేశాడు,జీవితంలో కష్టాలనేవి అందరికి కలిగేవే కానీ దానికి పరిష్కారం కోసమే మనిషి తిరగని చోటూ ఉండదు తట్టని తలుపూ ఉండదూ,కానీ అల్లహ్ తన దాసులకు దీనికి పరిష్కారాన్ని తెలుపుతూ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ ۚ إِنَّ ٱللَّهَ مَعَ ٱلصَّٰبِرِينَ
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.[అల్-బఖర/153].
ఖురాన్ పండితులు ఈ ఆయతు యొక్క తఫ్సీర్లో[తాత్పర్యంలో] ఈ విధంగా ఉల్లేఖించారు: “మహాప్రవక్త ఎప్పుడైనా తనపై ఏదైనా కష్టం వచ్చినప్పుడు నమాజు లేదా ఉపవాసం ద్వారా ఆ దేవుని నుండి సహాయాన్ని అర్జించేవారు”.
ఇమాం సాదిఖ్[అ.స] ఈ విధంగా సెలవిస్తున్నారు: ఈ లోకంలో మీకు కష్టాలు ఎదురైనప్పుడు,వుజూ చేసి మస్జిద్ కు వెళ్ళి నమాజు చేసి ఆ అల్లహ్ ను అర్జించండి ఎందుకంటే అల్లాహ్ తన దాసులకు ఈ విధంగా ఆజ్ఞిస్తున్నాడు:
“ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్జించండి”.
ఈ నమాజు శక్తి ఏమిటంటే ఇది అల్లాహ్ కు తన దాసులకు మద్య ఒక పటిష్టమైన బంధాన్ని ఏర్పరుచుతుంది,ఈ లోకంలో ఏ శక్తి మానవునికి పరిష్కారాన్ని చూపలేదు,ఈ పనిని కేవలం నమాజు మాత్రమే చేయగలదు.
వ్యాఖ్యానించండి