చెడును ఏమాత్రం సంకోచించకుండా వదలండి

శని, 12/14/2019 - 14:06

చెడు మార్గాన్ని విడిచి మంచి మార్గం ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఇతరుల హేళనకు భయపడకండి...

చెడును ఏమాత్రం సంకోచించకుండా వదలండి

కొన్ని సార్లు మనిషి చెడుకార్యములలో ఎంతెలా కూరుకుపోతాడండే ఆ చెడు పని అతడికి అలవాటుగా మారిపోతుంది. దాన్ని విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేడు. చెడ్డవాడిగా గుర్తించబడటం వల్ల మంచివాడిగా మారితే జనం హేళన చేస్తారేమోనన్న భయంతో ఆ ఆలోచనను రానివ్వడు, మద్యపానం విడిచి మసీదుకు వస్తే మిత్రులు నవ్వుకుంటారేమే అని ముందడుగు వేయడు. అతడికి ఆ చెడు నుండి విముక్తి మార్గం లేదు అని భావించి అందులోనే ఉండిపోవడానికి ఇష్టపడతాడు. ఇలాంటి వంద ఆలోచనలు అతడికి కట్టి పడేస్తాయి, ఇవన్నీ షైతాన్ అతడికి కలిపిస్తున్న ఆలోచనలు, ఇలాగే మనిషికి సందేహాలకు గురి చేసి మార్గభ్రతకు గురిచేయాలనే అతడి ఉద్దేశం. కాని చెడును ఎంత తొందరగా విడిచివేస్తే అంత మంచిది, ఇస్లాం ఇలాంటి మనిషిని గౌరవిస్తుంది, అతడిని మంచివారి సమూహానికి ఆహ్వానిస్తుంది. మనిషి యొక్క ఈ స్థితిని దృష్టిలో ఉంచి ఇమామ్ సజ్జాద్[అ.స] ఇలా ఉపదేశించారు: “చెడును విడిచిపెట్టే విషయంలో ఏమాత్రం ఆలోచించకు, నీవు వాటికి ఎంత బానిస అయినా సరే”[బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ161].

మనిషి చెడు ఊబిలో ఇరుక్కుపోయినా సరే నిరాశపడకూడదు, మంచి వైపుకు మరలి రావాలనుకుంటే ఏమాత్రం సంకోచించకుండా దాని నుండి బయటకు వచ్చేయాలి. మంచి వైపుకు రావాలనే ఆలోచన దైవనిర్ణయం అది అల్లాహ్ మనిషికి ప్రసాదించిన మంచి అవకాశం.

రిఫ్రెన్స్
బిహారుల్ అన్వార్, మొహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాస్ అల్ అరబీ, 1403ఖ.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9