గురు, 04/25/2019 - 03:07
దైవప్రవవక్త[స.అ] నాలుగు వాటిని సూచించి వీటిని మీరు చెడుగా భావించకండి అందులో మీకు మేలు ఉంది అని వివరించిన రివాయత్ వివరణ.
గియాస్ ఇబ్నె ఇబ్రాహీమ్, ఇమామ్ సాదిఖ్[అ.స] నుంచి మరియు వారు వారి పితామహుల నుంచి, వాళ్ళు ఇమామ్ అలీ[అ.స] నుంచి ఇలా ఉల్లేఖించారు: దైవప్రవవక్త[స.అ] ఇలా ప్రవచించారు: ఈ నాలుగు వాటిని చెడుగా భావించకు, అవి నీకు మేలయినవి:
1. జలుబును చెడుగా భావించకు(అసహ్యించుకోకు) అది కుష్టి రాకుండా చేస్తుంది.
2. కురుపులను చెడుగా భావించకు(అసహ్యించుకోకు) అవి తెల్ల కుష్టి రాకుండా చేస్తాయి.
3. కంటి నొప్పిని చెడుగా భావించకు(అసహ్యించుకోకు) అది అంధాకారం రాకుండా చేస్తుంది.
4. తుమ్మును చెడుగా భావించకు(అసహ్యించుకోకు) అది పక్షవాతం రాకుండా చేస్తుంది.[ఖిసాల్, భాగం1, పేజీ307]
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి