తానంటించిన నిప్పుకు తానే ఆహుతి

శని, 12/14/2019 - 16:45

సమాజంలో అల్లర్లను సృష్టించి తప్పించుకుందాం అనుకోవటం తప్పు ఒక రోజు ఆ అల్లర్ల యొక్క ఊబిలో మీరు కూడా తప్పక చిక్కుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోగలరు.

నిప్పు,ఆహుతి,ఇమాం అలి.

ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే కుట్రల యొక్క నిప్పును వెలిగిస్తారో వారే ఆ అగ్నికి ఆహుతి అవుతారు”.అల్లర్లు మరియు కుట్రలు సమాజం యొక్క భద్రతకు భంగాన్ని కలుగజేస్తాయి మరియు పర్యావరణాన్ని అనుచితంగా చేస్తాయి.ఎంతవరకంటే ఆ నీప్పును అంటించిన వాడు కూడా ఆ అగ్నికీలలలో మండి మసవ్వక తప్పదు. ఎవరైతే అల్లర్లను సృష్టించి ఈ సమాజం యొక్క శాంతికి భంగం కల్పించాలనుకుంటారో వారు కూడా ఈ సమాజం యొక్క భాగమే.ఎలాగైతే ఒక ఇంటిని కాల్చి దానిని బూడిద చేయాలనే దురాలోచనతో దానికి నిప్పంటిస్తారో ఆ నిప్పు కొద్దిసేపటికి మీ ఇంటికి కూడా చేరుకోగలదు అనేది గుర్తుంచుకోవాలి. సమాజంలో చేయబడే కుట్రలు కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సమూహానికి నష్టాన్ని కలుగజేస్తాయి అనుకోవటం తప్పు.ఒక వేళ ఈ సమాజంలో మొదటి కుట్ర చేసింది మీరేనైతే ఆ సమాజంలో జరిగే ఇతర కుట్రలకు కూడా మీరే ఎంతోకొంత బాధ్యులు.అది చివరకు వచ్చి మీపైనే సమాప్తమవుతుంది. అందుకే తాను ఇతరులకు తవ్వే గోతిలో ఒక రోజు తానే తప్పక పడతాడు అనడంలో సందేహం లేదు.

రెఫరెన్స్: హిక్మత్ హాయె అలవి,జవాద్ మొహద్దసి.

  

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13