నెహ్జుల్ బలాఘా మరియు ఇమాం అలి[అ.స]

మంగళ, 03/27/2018 - 10:02

ఏ విధంగా ఐతే ఖురాన్ కు ఏ ఇతర గ్రంధం సాటి రాదని చెప్పగలమో అదే విధంగా ఖురాన్ మరియు మహాప్రవక్త ఉపదేశాల తరువాత నెహ్జుల్ బలాఘాకు ఏ ఇతర గ్రంధము సాటి రాజాలదు.   

నెహ్జుల్ బలాఘా మరియు ఇమాం అలి[అ.స]

నెహ్జుల్ బలాఘా గ్రంధం ఇమాం అలి[అ.స] ల వారి యొక్క ఉపన్యాసాలు, లేఖలు మరియు వారి యొక్క ఉపదేశాల యొక్క సమాహారము, ఈ గ్రంధాన్ని సయ్యద్ రజీ[ర.అ] ద్వారా హిజ్రీ యొక్క నాలుగవ శతాబ్దములో సేకరించటం జరిగింది, ఈ నెహ్జుల్ బలాఘాలోని ఇమాం అలి[అ.స]ల వారి ప్రవచనాలు మరియు ప్రసంగాలు వాటి వాక్చాతుర్యం మరియు వాగ్ధాటిలో వాటికి అవే సాటి అని చెప్పవచ్చు.
ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత ముఫ్తి అయినటువంటి మొహమ్మద్ అబ్దుహ్ తను వ్రాసిన నెహ్జుల్ బలాఘా యొక్క వివరణలో ఇలా అన్నారు: "ఖురాన్ మరియు మహాప్రవక్త ప్రవచనాల తరువాత ఈ నెహ్జుల్ బలాఘాలోని ఇమాం అలి[అ.స]ల వారి ఉపదేశాలు, ప్రసంగాలు అత్యంత అమూల్యమైనవి, అర్ధవంతమైనవి మరియు సమగ్రమైనవి".
దీనిని మూడు భాగాలుగా విభజించి మొదటి భాగంలో ఇమాం అలి[అ.స]ల వారు వివిధ సందర్భాలలో ఇచ్చిన ఉపన్యాసాలను [సిఫ్ఫీన్ యుద్ధంలొ, తల్హా మరియు జుబైర్ లను సంబోధించి ఇచ్చిన ఉపన్యాసం, షిఖ్షిఖియ(ఒంటె యొక్క గర్జన యొక్క శబ్ధం) ఉపన్యాసం,నెహ్రవాన్ యుద్ధంలో ఇచ్చిన ఉపన్యాసం ముఖ్యమైనవి], రెండవ భాగంలో ఇమాం ల వారు మావియాతో సహా కూఫా వాసులకు మరియు తన క్రింది అధికారులకు సంభొదిస్తూ వ్రాసిన లేఖలను మరియు మూడో భాగంలో ఇమాం ల వారి చిన్న ఉచ్చారణలను(ఉపదేసాలు) పొందుపరచటం జరిగింది.
ఈ నెహ్జుల్ బలాఘాలోని ఇమాం అలి[అ.స]ల వారి ప్రసంగాలు మరియు ఉపదేశాలు ఏకేశ్వరవాదం, న్యాయం, మానవుని సృష్టి, సదాచారుల,విస్వాసుల మరియు కపటుల లక్షణాలు, మహాప్రవక్త వంశం యొక్క ప్రత్యేకతలు, ప్రవక్త కుటుంబం యొక్క విశిష్టతలు, ఖురాన్ ఆయాతుల యొక్క వివరణ, వివేకుల మరియు అవివేకుల లక్షణాలు,ప్రళయదినం, ప్రపంచం యొక్క వాస్తవికత మరెన్నో అంశాలను ఉదాహరణల ద్వారా మానవునికి కనువిప్పు కలిగేలా, నిర్లక్ష్యులను మేల్కొలిపే విధంగా వివరించటం జరిగింది.
ప్రపంచంలో గల ఎన్నో భాషలలో ఈ గ్రంధాన్ని అనువదించటం జరిగింది, అల్లామా అమీని[ర.అ] గారి అనుసారంగా ఇప్పటి వరకు ఈ నెహ్జుల్ బలాఘా యొక్క 81 వివరణలు వ్రాయటం జరిగింది అందులో అబిల్ హదీద్ మోతజలి, ఇబ్నె మీసమె బెహ్రాని యొక్క వివరణలు చెప్పదగినవి.
నెహ్జుల్ బలాఘా యొక్క వాక్చాతుర్యం మరియు వాగ్ధాటి ఎటువంటిదంటే దీని ద్వారా దాహపరులైన జ్ఞానులు ప్రళయ దినం వరకు తమ విజ్ఞాన దాహాన్ని తీర్చుకుంటూనే ఉంటారని చెప్పవచ్చు.

రెఫరెన్స్
అల్-గదీర్, అల్లామ అమీని[ర.అ].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5