జమల్ యుధ్ధంలో ఇమాం అలి[అ.స] తీరు

సోమ, 11/11/2019 - 19:05

కొన్ని క్లిష్ట సమయాలలో ఇమాం అలి[అ.స] ల వారు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయం మరియు అవి ముస్లిముల ఐక్యత కొరకు ఇమాం ల వారి కృషిని వివరిస్తాయి.

ఇమాం అలి,జమల్,ఐక్యత.

దైవప్రవక్త[స.అ.వ] ల వారి తరువాత పవిత్ర ఇమాముల తీరు మరియు ముస్లిముల ఐక్యత కొరకు వారు చేసిన కృషి ఐక్యమత్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది.ముఖ్యంగా ఇమాం అలి[అ.స] ల వారు కష్ట సమయాలలో ముస్లిములు వర్గాలుగా చీలిపోకుండా ఉండటానికి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి సందర్భాలలో జమల్ యుధ్ధం కూడా  ఒకటి.జమల్ యుధ్ధ సమయంలో కొంత మంది నాయకులు కుట్రకు పాల్పడినప్పుడు ఇమాం ల వారు బస్రా వైపు పయనమయ్యారు ఆ సమయంలో ఈ విధంగా ఉల్లెఖించటం జరిగింది: “నేను చూస్తున్నాను ఇచట సహనాన్ని పాటించటం ముస్లిముల విభజన మరియు వారి రక్తాన్ని చిందించే కన్నా ఉత్తమము.ఇప్పుడే ముస్లిములైన ప్రజల యొక్క ఉపమానం నీటితో నిండి ఉన్న ఒక కూజా లాంటిది ఏమాత్రం కొద్దిగా కదిపినా లేదా ఏ ఒక్క వ్యక్తి దానిని తలక్రిందులుగా చేసినా నీరు నేలపాలవుతుంది [అదే విధంగా తాజాగా ఇస్లామును స్వీకరించిన ముస్లిములు కూడా విబేధాల వలన ఇస్లాము నుండి దూరము కావచ్చునని ఇమాం ల వారి ఉద్దేశం], తల్ హా మరియు జుబైర్ ఈ నిప్పును రగల్చే పని చేయక పోతే ఎంత బాగుండేదో”.

రెఫరెన్స్: షర్హె నెహ్జుల్ బలాఘా,ఇబ్నె అబిల్ హదీద్,1 వ భాగం,పేజీ నం:308.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 44