ఇమాం అలి[అ.స]ల వారికి దైవప్రవక్త ఉపదేశాలు

సోమ, 03/04/2019 - 17:05

ఇమాం అలి[అ.స]ల వారితో దైవప్రవక్త[స.అ]ల వారి హితోక్తులు.

ఇమాం అలి[అ.స]ల వారికి దైవప్రవక్త ఉపదేశాలు

ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: దైవప్రవక్త[స.అ]ల వారు ఈ ఇమాం అలి[అ.స]ల వారితో ఈ విధంగా ఉపదేసించారు:
1. ఓ అలి! నేను మిమ్మల్ని మూడు అతిపెద్ద లక్షణాల నుండి ఆపుతున్నాను: మొదటిది పిసినారితనం, రెండవది అత్యాశ, మూడవది అసత్యాలు చెప్పటం.
2. ఓ అలి! మూడు కార్యాలు అతి పెద్దవి: మొదటిది నిజాయితీతో ప్రవర్తించటం, రెండవది ఇతర ముస్లిం సోదరులతో సాహచర్యం కేవలం ఆ భగవంతుని సమ్మతి కొరకు, మూడవది నిరంతరం అల్లాహ్ స్మరణ.
3. ఓ అలి! విశ్వాసునికి(మోమిన్ కి) ఈ లోకంలో మూడు సంతోషాలు ఉన్నాయి(మూడు చోట్ల ఆనందిస్తాడు): ఇతర విశ్వాసులతో  కలిసేటప్పుడు, ఉపవాసం యొక్క ఇఫ్తార్(విడిచే) సమయంలో, రాత్రి యొక్క చివరి ఘడియలలో నమాజు చేసేటప్పుడు.
4. ఓ అలి! ఎవరిలో అయితే ఈ మూడు విషయాలు ఉండవో వారి ఏ పని సరైనదికాదు: పాపములనుండి ఆపే సదాచారము, ఇతరులతో సత్ప్రవర్తనతో నడుచుకునేటట్లు చెసే మంచి స్వభావం, మూర్ఖులు వారితో చెడుగా ప్రవర్తించినప్పుడు వారిని క్షమించి వదిలేసే ఓర్పు మరియు సహనశీలత.   

రెఫరెన్స్:
అల్ ఖిసాల్, షైఖ్ సదూఖ్, పేజీ నం:120.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27