ఆహారపు నియమాలు ఇస్లాం దృష్టిలో

ఆది, 12/10/2017 - 19:04

ఇస్లాంలో ప్రతీ పనికి దానికి అవసరమైన నియమాలను వివరించడం జరిగింది అలాగే దానిలో ఆహరపు నియమాలు కూడ చాలా ముఖ్యమైనవి వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రస్థావిచడం జరిగింది. 

ఆహారపు నియమాలు ఇస్లాం దృష్టిలో

అనంతకరునమయుడు అపారక్రుపాసీలుడైన అల్లహ్ పేరిట
ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆహరపు అలవాట్లు ఉంటాయి, కానీ మనం గమనించినట్లైతే చాలా మంది సరైన అలవాట్లను అలవరుచుకోనివారే దీనంతటికి కారణం వారికి వారి మతం పట్ల అవగాహన తక్కువగా ఉండటమే, కానీ ఇస్లాంలో ఆహారపు నియమాలను ప్రత్యేకంగా వివరించడం జరిగింది వాటిలో కొన్నింటిని మేము ఇక్కడ ప్రస్థావిస్తున్నాము.
1. ఆకలి వేయనంత వరకు ఏమి తినకుండా ఉండటం: ఆకలి వేయనంత వరకు తినకుండా ఉండటం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదని ఇస్లామీయ వైద్యశాస్త్రం చెబుతుంది. దీని గురించి పవిత్ర ఇమాములు కూడా ఈ విధంగా సెలవిచ్చారు:"ఆకలి వేయనంత వరకు ఆహారం జోలికి పోవద్దు, ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు దేవుడు పేరుతో ఆహరన్ని భుజించు".
2. ఆహారాన్ని ఉప్పుతో మొదలుపెట్టడం: ఇస్లాంలో భోజనాన్ని ఉప్పుతో మొదలుపెట్టమని చాలా చోట్ల ఆజ్ఞాపించడం జరిగింది. ఇమాం అలీ[అ.స] ఈ విధంగా సెలవిచ్చారు: "మీ యొక్క భోజనాన్ని ఉప్పుతో మొదలుపెట్టండి దీనిలో ఉన్న ప్రత్యేకత మీకు తెలిస్తే ప్రతీ మనిషి మందులకు బదులు ఈ ఉప్పునే మందుగా ఉపయోగిస్తాడు".[తిబ్బుల్ అఇమ్మ, పేజీ నం:70].
3. భోజనానికి ముందు చేతులను సుభ్రంగా కడుగుకోవడం: ఇమాం అలీ[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:"భోజానానికి ముందు చేతులను సుభ్రంగా కడుగుకోవటం మీ యొక్క ఉపాదిలో పెరుగుదలకు కారణం"[అల్-ఖిసాల్, షేఖ్ సదూఖ్, పేజీ నం:612].
4. ఆహారాన్ని బాగ నమిలి తినటం: హదీసులలో ఆహారం తినటం గురించి ఈ విధంగా ప్రస్థావింపబడినది: ఆహారాన్ని బాగా నమిలి భుజించండి మరియు తొందరపాటుతో భుజించకండి.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచారు:"ఆహారాన్ని చాలా ఎక్కువ సేపు వరకు తినండి(దస్తర్ఖాన్ పై ఎక్కువ సేపు కూర్చోండి) ఎందుకంటే దానిపై గడిపిన సమయం గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరగదు.[సఫీనతుల్ బిహార్,భాగం: 1,పేజీ నం: 27].

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9