వీపు వెనుక చాడీలు చెప్పటం పిరికివాని యొక్క లక్షణం.చాడీలు చెప్పే వాళ్ళు అల్లాహ్ కరుణకు అర్హులు కాలేరు.
ఒక వ్యక్తి ఒక వివేకవంతుడైన ఒక మహపురుషుని వద్దకు వెళ్ళి "ఫలాన వ్యక్తి మీ గురించి మీ వెనక ఎంత చెడుగా మాట్లాడుతున్నాడో మీకు తెలుసా?" అని అన్నాడు.దానికి ఆ మహాపురుషుడు చిరునవ్వు చిందిస్తూ ఆ వ్యక్తి నా వైపునకు ఒక బాణాన్ని విసిరాడు కానీ అది నాకు తగలలేదు.కానీ నువ్వు ఎందుకు దానిని తీసుకు వచ్చి నా హృదయాన్ని గాయపరుస్తున్నావు? అని అన్నారు.చాడీలు చెప్పటం అనేది సమాజాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన వ్యాది. ఈ రోజు మన సమాజంలో కూడా కొందరు ఇలాంటి పనులకే అలవాటుపడి ఉన్నారు.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా[చాడీలు] చెప్పుకోకూడదు.ఏమిటి మీలొ ఎవరయినా చచ్చిపోయిన మీ సోదరుని మాంసము తినటానికి ఇష్టపడతారా? [అల్ హుజురాత్/12].ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: "చాడీలు చెప్పేవాడి చాడీలను నమ్మటంలో తొందరపడవద్దు,ఎందుకంటే చాడీలు చెప్పేవాడు ఒక సలహాదారుని రూపంలో తనను తాను చూపుతాడు,కానీ అతడు ఒక ద్రోహి".
రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:239.
వ్యాఖ్యానించండి