.ఉజూ చేేసే విధానాన్ని ఖుర్ఆన్ యొక్క ఆయత్ ఆధారం ద్వార సంక్షిప్తంగా చెప్పబడింది.
ఖుర్ఆన్ నమాజ్
ను విధిగా నిర్ధారించెను. నమాజు సమయం అయిన తరువాత ముందుగా ఉజూ(ఉదూ) చేయాలీ అనగా మై ఉజూ(ఉదూ) కర్తా హూఁ లేదా కర్తీ హూఁ ఖుర్బతన్ ఇలల్లాహ్ (నేను ఉజూ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కోసం) అని నోటితో చెబుతూ లేదా మనసులో అనుకుంటూ ముఖాన్ని ఒకసారి, కుడి చేయిని ఒకసారి మరియు ఎడమ చేయిని ఒకసారి కడగాలి,(రెండవ సార్లు కూడా కడగవచ్చు, కాని మూడు సార్లు కడిగితే ఉజూ వ్యర్థమవుతుంది) ఆ తరువాత కుడిచేయిని తలపాపటలో అలాగే కుడి చేతితో కుడి కాలువేళ్ళభాగం నుండి ఎత్తుభాగం వరకు అలాగే ఎడమ చేతితో ఎడమ కాలు వ్రేళ్ళభాగం నుండి ఎత్తుభాగం వరకు మసాహ్(తాకాలి) చేయాలి.
ముఖాన్ని నొసలు పై భాగం అనగా తల వెంట్రుకల నుండి గడ్డం(Chin) వరకు అలాగే చేతులను మోచేతుల నుండి కడుక్కోవాలి.
పవిత్ర ఖుర్ఆన్
లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قُمۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ فَٱغۡسِلُواْ وُجُوهَكُمۡ وَأَيۡدِيَكُمۡ إِلَى ٱلۡمَرَافِقِ وَٱمۡسَحُواْ بِرُءُوسِكُمۡ وَأَرۡجُلَكُمۡ إِلَى ٱلۡكَعۡبَيۡنِ; ఓ విశ్వాసులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మీ చేతులను మోచేతుల నుండి కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను మసహ్ చేయిండి.[మాయిదహ్ సూరా:5, ఆయత్:6]
వ్యాఖ్యానించండి