.ఖుర్బాన్ పండగ రోజున చదివే నమాజ్ పై పవిత్ర ఖుర్ఆన్ నిదర్శనం.
ఇస్లాం ధర్మం యొక్క ప్రాముఖ్యత గల నమాజులలో ఒకటి “ఈదుల్ ఖుర్బాన్” నమాజ్. ముందుగా మేము ఎందుకు ఆరోజు నమాజ్ చదవాలి అన్న విషయాన్ని ఖుర్ఆన్ ఆయతుల ద్వార తెలుసుకుందాం. అల్లాహ్, ఖుర్ఆన్
లో వీటిని కొన్ని సందర్భాలలో ఇలా సూచించెను:
1. అల్లాహ్ “అఅలా” సూరాలో ఇలా ప్రవచించెను: قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ; నిస్సందేహముగా పరిశుద్ధతను పాటించి, తన ప్రభువు నామాన్ని స్మరించి, ఆ తరువాత నమాజ్ చేసిన వాడు తప్పకుండా సాఫల్యం పొందుతాడు. [అఅలా సూరా, ఆయత్14,15]. రివాయత్ లో ఇలా వ్యాఖ్యానించబడి ఉంది. ذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ అనగా నమాజె ఖుర్బాన్ మరియు నమాజె ఈదుల్ ఫిత్ర్.(బిహారుల్ అన్వార్, భాగం87, పేజీ348)
2. సూరయే "కౌసర్"లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చేయ్యి మరియు ఖుర్బానీ ఇవ్వు[సూరయే కౌసర్, ఆయత్:2]. ఇక్కడ కూడా ఖుర్ఆన్ వ్యాఖ్యుల మరియు దైవప్రవక్త[స.అ] యొక్క రివాయత్ ప్రకారం “ఈదుల్ అజ్
హా” యొక్క నమాజే. [బిహారుల్ అన్వార్, భాగం87, పేజీ349]
రిఫ్రెన్స్
ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం87, పేజీ348
వ్యాఖ్యానించండి