అప్పు తెచ్చే ముప్పు

శని, 12/21/2019 - 16:58

అప్పు తీసుకోవటం తప్పు కాదు దానిని సరైన సమయంలో తీర్చక పోవటం తప్పు మరియు ఆ విధంగా చేయటం అల్లాహ్ మరియు అతని ప్రవక్త[స.అ.వ] ల వారి అనుగ్రహానికి దూరం చేస్తుంది.

అప్పు, జనాజా, దైవప్రవక్త.

నమాజు చదవటానికి ఒక వ్యక్తి యొక్క జనాజాను దైవప్రవక్త[స.అ.వ] ల వారి ముందు తీసుకురావటం జరిగింది.దైవప్రవక్త[స.అ.వ] ల వారు తన అనుచరులను సంభోదిస్తూ “మీరు అతని జనాజాపై నమాజు చదవండి నేను చదవను” అని అన్నారు.అనుచరులు “మీరు అతని జనాజాపై నమాజు ఎందుకు చేయరు” అని ప్రశ్నించారు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “అతను ప్రజలకు రుణపడి ఉన్నాడు” అని అన్నారు.అప్పుడు అబూ ఖుతాదా ముందుకు వచ్చి “నేను అతని జామిను అయ్యి అతని అప్పును తీర్చేస్తాను” అని అన్నాడు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “నువ్వు అప్పును పూర్తిగా తీర్చేస్తావుగా?” అని ప్రశ్నించారు.అబూ ఖుతాదా “అవును పూర్తిగా తేర్చేస్తాను” అని అన్నాడు.అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు అతనిపై నమాజు చేశారు.ఆ తరువాత అతని అప్పు ఎంత? అని ఆరాతీస్తే కేవలం పదిహేడు లేదా పద్దెనిమిది దిర్హములు అని అబూ ఖుతాదా తెలిపాడు. అప్పు తీసుకోవటంలో తప్పు లేదు కానీ అదే అప్పును నిర్దేశించిన సమయంలోనే తిరిగి ఇవ్వటం ధర్మము అదే ఒక విశ్వాసుని లక్షణము.

రెఫరెన్స్: ఎక్ సదొ బీస్త్ దర్సె జిందగీ అజ్ సీరయే ముహమ్మద్[స.అ.వ],పేజీ నం:3.

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6